Littles : కప్ప-ముత్యం
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:13 AM
అనగనగా ఒకఅడవిలో కొలనులో ఉండే కప్పకు అదే చోట ఉండే హంసతో మంచి స్నేహం కుదిరింది. కొన్ని రోజుల్లోనే అవి రెండూ ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకసారి కప్ప కొలనులోని తామరాకు మీద తేలుతూ, హంస ఒడ్డున నిలబడికబుర్లు చెప్పుకుంటున్నాయి.
Littles : అనగనగా ఒకఅడవిలో కొలనులో ఉండే కప్పకు అదే చోట ఉండే హంసతో మంచి స్నేహం కుదిరింది. కొన్ని రోజుల్లోనే అవి రెండూ ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకసారి కప్ప కొలనులోని తామరాకు మీద తేలుతూ, హంస ఒడ్డున నిలబడికబుర్లు చెప్పుకుంటున్నాయి.
ఈలోగా ఎక్కడినుండి చూసాడో ఒక వేటగాడు చెట్టు చాటునుండి వచ్చి హంస మీదకు వల విసిరాడు. ఆ వలనుండి తప్పించుకోలేక పాపం హంస విలవిల్లాడింది, కప్ప ఆ వేటగాడిని చూసి, దయచేసి నా నేస్తాన్ని వదిలిపెట్టు అని ప్రాధేయపడింది. దానికి వేటగాడు
నేను వతలను దీన్ని సంతలో అమ్మితే చాలా డబ్బు వస్తుంది’ అన్నాడు అది విన్న కప్ప నీకు డబ్బే కదా కావలసింది?’ అంటూ నీటిలో మునిగి ఒక ముత్యంతో తిరిగి వచ్చి వేటగాడితో ఇలా అన్నది. ‘ఈ ముత్యం తీఉకో. దీన్ని అమ్ముకున్నా,నీకు చాలా సొమ్ము వస్తుందిఇది తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు’ ఆ ముత్యం తీసుకుని, వేటగాడు హంసను వదిలేసి
వెళ్లిపోయాడు. అతను ఇంటికి వెళ్లి జరిగినదంతా తన భార్యతో చెప్పాడు ఆమె అంతా విని,‘ఆ కప్ప దగ్గర ఇంకా చాలాల ముత్యాలు ఉండి ఉంటాయి. ఇవాళే వెళ్లి, అవన్నీ తీసుకురా అన్నది. ఆ మర్నాడు వేటగాడు కొలను దగ్గరకు వెళ్లి, కప్పతో ‘ఏయ్ నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చెయ్ లేదంటే హంసను తీసుకెళ్లిపోతాను అని బెదిరించాడు. దానికి కప్ప
ఏదీ నీ దగ్గరున్న ముత్యం ఓసారిలా ఇవ్వు, దాన్ని చూసి, అచ్చం అలాంటి ముత్యాలే వెతికి తీసుకొస్తాను’అని ముత్యం తీసుకుని చటుక్కున నీళ్లలో దూకింది పోతూపోతూ, నా నేస్తం ఎపుడో దాక్కుంది. మేము నీకు దొరకము. అత్యాశతో నీ వద్ద ఉన్న ఒక్క ముత్యం కూడా పోగొట్టుకున్నావు’ అన్నది. అనవసరంగా మంచి ముత్యాన్ని వదులుకున్నాను కదా అని వేటగాడు బాధ పడ్డాడు. అంత ఉపాయంతో తన ప్రాణాలు కాపాడిన కప్పకు కృతజ్ఞతలు చెప్పింది హంస. అప్పటినుండి ఆ రెంటి స్నేహం మరింత బలపడింది.
Updated Date - Sep 21 , 2024 | 12:13 AM