Littles : చిలుక దివ్యదృష్టి
ABN, Publish Date - Aug 24 , 2024 | 04:58 AM
అక్బర్ చక్రవర్తికి రోజూ నిద్ర పోయే ముందు తన వేళ్లకున్న ఉంగరాలు తీసి, పక్కనున్న బల్ల మీద ఉంచి తెల్లారిన తరువాత మరలా వాటిని తీసి అలంకరించుకోవడం అలవాటుగా ఉండేది.
Littles : అక్బర్ చక్రవర్తికి రోజూ నిద్ర పోయే ముందు తన వేళ్లకున్న ఉంగరాలు తీసి, పక్కనున్న బల్ల మీద ఉంచి తెల్లారిన తరువాత మరలా వాటిని తీసి అలంకరించుకోవడం అలవాటుగా ఉండేది.
ఒక రోజు ఉదయం చక్రవర్తి నిద్ర లేచి చూసేసరికి ఆయనకు ఎంతో ఇష్టమైన ఒక ఉంగరం మాయమైపోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. రాజుగారి పడకగది లోనుంచే ఉంగరం కనిపించకుండా పోయిందంటే, అది ఖచ్చితంగా ఎవరో రాజు గారికి దగ్గరగా మసలుకునే సేవకులే దొంగిలించి ఉంటారు అనురుకున్నారు అందరూ.
ఏం చేయాలో తెలియకచక్రవర్తి వెంటనే బీర్బల్‌కి కబురు పంపాడు. బీర్బల్ వస్తూ తనతో పాటు ఒక చిలుకను తీసుకువచ్చి, మహారాజా.. ఈ చిలుక దొంగ ఎవరో కనిపెట్టగలదు అన్నాడు.
దానికి చక్రవర్తి ఈ చిలుక జ్యోతిష్యం కోసమా నేను నిన్ను పిలిపించింది? అని కోపంగా అడిగాడు. దానికి బీర్బల్ ‘లేదు మహారాజా ఈ చిలుకకు దివ్యదృష్టి ఉంది ఇది ఉంగరం తీసిన మనిషిని చూడగానే గుర్తు పట్టి దొంగ అని అరుస్తుంది. అన్నాడుఅది విన్న చక్రవర్తి సరే అయితే ఈ చిలుక నా ఉంగరాన్ని దొరికేలా చేస్తే దానికి,నీకు మంచి బహుమానాలు ఇస్తాను అన్నాడు.
కాసేపటి తర్వాత అక్కడ పనిచేసే ఉద్యోగులు అందరినీ పిలిపించి గది తలుపులు మూయించమని అడిగాడు బీర్బల్. చక్రవర్తి అలాగే ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ వచ్చిన కొంత సేపటికి చిలుక బీర్బల్ దగ్గరనుండి గాలిలోకి ఎగిరి, దొంగ దొంగ అని అరిచింది అక్కడున్న పనివారిలో ఒకరు రాజు కంట పడకుండా తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అతన్ని చూపించి, బీర్బల్ ఇదిగో మహారాజా మీ ఉంగరం తీసుకున్న దొంగ అని అతన్ని పట్టించాడు అది విన్న చక్రవర్తి ‘ఇపుడు చెప్పు ఈ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది? దొంగను ఎలా గుర్తు పట్టగలిగింది?’ అని అడిగాడు.
దానికి బీర్బల్ ‘‘దివ్య దృష్టీ లేదు మరేమీ లేదు మహారాజా దీనికి దొంగ దొంగ అనే ఒక్క మాటే నేర్పాను. దీన్ని నా చేతి మీద కూర్చున్నపుడు నిమురుతూ నెమ్మదిగా గిల్లాను.అది అలవాటుగా లేచి దొంగ అన అరచింది.
ఆ మాట వినగానే ఎవరైతే ఉలిక్కిపడి సర్దుకోవడానికి, పారిపోవడానికి ప్రయత్నిస్తారో వారే దొంగ కదా అలా మీ దొంగను ట్ట్టుకున్నాం అన్నమాట’ అని చెప్పాడు. బీర్బల్ హాస్య చతురతకు నవ్వుకున్నా, అతని యుక్తిని మెచ్చుకుని, ముందు వాగ్దానం చేసిన ప్రకారం మంచి బహుమతులు ఇచ్చి పంపాడు చక్రవర్తి.
Updated Date - Aug 24 , 2024 | 04:58 AM