Littles : తగిన శాస్తి
ABN, Publish Date - Aug 23 , 2024 | 05:09 AM
రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
Littles : రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రాణ నష్టం ఏమీ లేకున్నా, ఇంటి లోపలి విలువైన వస్తువులు కాలి, బూడిదవుతున్నాయి. ఇంతలో అక్కడికి వచ్చిన రామనాథం ‘వ్యాపారానికి కావలసిన డబ్బు నాలుగు లక్షలు లోపల పెట్టాను అది కూడా బూడడిద ఐతే ఎలా’ అని పెద్దపెట్టున ఏడవసాగాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రిష్ణయ్య ‘రామనాథం గారూ మీ డబ్బు లోపలినుండి నేను క్షేమంగా తెచ్చి ఇస్తాను. కానీ తెచ్చిన డబ్బులో నాకు ఇష్టమైనది మీకు ఇచ్చి మిగతాది నేను తీసుకుంటాను.
సరేనా? అన్నాడు. దానికి సరే అన్నాడు రామనాథం. అపుడు క్రిష్ణయ్య ఎంతో ధైర్యంగా లోపలికి వెళ్లి, డబ్బుమూట బయటకు తెచ్చాడు కానీ, తెచ్చిన సొమ్ములో వంద రూపాయలు మాత్రం రామనాథానికి ఇచ్చి, మిగతా డబ్బు మొత్తం తన సంచీలోవేసుకుని, వెళ్లబోయాడు.
ఇది అన్యాయం అనిక్రిష్ణయ్యను ఆపాడు రామనాథం. ‘నేను చెప్పినట్లే కదా చేశాను ఇంకేం అన్యాయం’ అన్నాడు క్రిష్ణయ్య. విషయం పంచాయితీ దాకా వెళ్లింది, పంచాయితీ పెద్ద కేశవరావు జరిగినదంతా విని, క్రిష్ణయ్యతో ఇలా అన్నాడు.‘ క్రిష్ణయ్యా ఆ డబ్బుమూట మరియు వంద రూపాయలు చెరోవైపున పెటు’్ట అన్నాడు. అలాగే చోడు క్రిష్ణయ్య. ఇపడు చెప్పు క్రిష్ణయ్యా ఈ రెండిటిలో నీకు ఇష్టమైనది ఆ పెద్దడబ్బు మూటనే కదా అని అడిగాడు. అవును అని జవాబుచెప్పాడు క్రిష్ణయ్య. ‘నువ్వు నీకు ఇష్టమైనది రామనాథానికి ఇస్తాను అని కదా అన్నావు?
కాబట్టి మారు మాట్లాడకుండా ఆడబ్బు మూట అతనికి ఇచ్చేసి, అతను సంతోషంగా ఎంత ఇస్తే అంత పుచ్చుకో’ అన్నాడు కేశవరావు దానికి క్రిష్ణయ్య నా ఉద్దేశం అది కాదు నాకు ఇష్టమైనది అంటే నాకు నచ్చినంత అని అర్థం’ అన్నాడు దానికి కేశవరావు ‘నీ ఉద్దేశం మంచిదైతే ఈ గొడవే లేదు కదా. నువ్వు తెలివైనవాడివి.. కానీ ఈ దురాశ మంచిది కాదు మానుకో అని హితవు చెప్పి, అతన్ని అక్కడి నుండి పంపేశాడు పంచాయితీ పెద్ద. అతని దురాశకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకున్నారు.
Updated Date - Aug 23 , 2024 | 05:09 AM