Story : చావు తెచ్చిన మామిడి పండ్లు
ABN, Publish Date - Aug 16 , 2024 | 11:28 PM
తెనాలి రామలింగ కవి ఒక రోజు కృష్ణ దేవరాయల కొలువుకు వెళుతూ ఉండగా భటుడు ఒకరు బంగారు పళ్లెం నిండా మామిడిపండ్లను వాటితో పాటు ఒక లేఖను లోపలికి తీసుకెళ్లడం చూసాడు.
తెనాలి రామలింగ కవి ఒక రోజు కృష్ణ దేవరాయల కొలువుకు వెళుతూ ఉండగా భటుడు ఒకరు బంగారు పళ్లెం నిండా మామిడిపండ్లను వాటితో పాటు ఒక లేఖను లోపలికి తీసుకెళ్లడం చూసాడు.
ఆ మామిడి పండ్ల తియ్యని వాసనకు తెనాలి రామలింగ కవికి నోరు ఊరింది. ఆ పండ్లలో ఒక పండైనా తింటే బాగుండు అనుకున్నాడు. రాజుగారికి ఆ పండ్లు అందగానే ఒక పండును తీసి కొంచెం కొరికాడు. అది చూసిన రాజుగారు ‘నీకెంత ధైర్యం? నా కోసమని పొరుగు దేశపు రాజు కానుకగా పంపిన పండ్లను, అది కూడా నా అనుమతి లేకుండా తింటావా? నీ తల తీయిస్తాను’ అని కోపంగా అన్నాడు. వెంటనే
రామలింగ కవి గట్టిగా ఇలా అరవసాగాడు‘ ఇవేమి పండ్లురా బాబోయ్; ఒక్కపండు కొంచెం తిన్నందుకే నాకు చావు మూడింది.
ఇక మొత్తం పండ్లు తిన్న మహారాజు గారికి ఏ గతి పట్టనుందో’ అని కేకలు వేసాడు. ఆ చేష్టలకు నవ్వుకున్న రాయలు కవికి వేసిన శిక్షను రద్దు చేయడమే కాకుండా అతనికి కొన్ని మామిడి పండ్లను కూడా ఇచ్చి పంపాడు. తన చమత్కారంతో పండ్లను సాధించిన విధానం చూసి సభలో అందరూ రాజుగారితో పాటే వికటకవి తెలివికి నవ్వుకున్నారు.
Updated Date - Aug 16 , 2024 | 11:28 PM