Story : కాకి- పిచ్చుక
ABN, Publish Date - May 29 , 2024 | 05:33 AM
రామాపురంపక్కన గల చిట్టడవిలో ఒక కాకి ఉండేది. అది తనంత ఎత్తులో ఏ ఇతర పక్షి కూడా ఎగరలేదని గర్వ పడుతూఉండేది. ఒక రోజు కాకి అటుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకను చూసింది. దాన్ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా రానట్లున్నది. ఏదో పురుగు గెంతినట్లు
రామాపురంపక్కన గల చిట్టడవిలో ఒక కాకి ఉండేది. అది తనంత ఎత్తులో ఏ ఇతర పక్షి కూడా ఎగరలేదని గర్వ పడుతూఉండేది. ఒక రోజు కాకి అటుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకను చూసింది. దాన్ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా రానట్లున్నది. ఏదో పురుగు గెంతినట్లు ఎగురుతున్నావు అని హేళన చేసింది.ఈమాటలకు నొచ్చుకున్న పిచ్చుక నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వారిది అన్నది.అపుడు కాకి, చేతనైతే నాతోపోటీ పడి, నీ సామర్థ్యం నిరూపించుకో అని సవాలు చేసింది. ఈ పోటీకి అడవిలోని మిగతా పక్షులు చాలా న్యాయ నిర్ణేతలుగా వచ్చాయి.మనం కూర్చున్న ఈ చెట్టుతో మొదలుపెట్టి పక్కనున్న రావిచెట్టు దాటుకుని దాని పక్కనున్న మర్రి చెట్టుకొమ్మలలోనుంచి ఎవరు ముందుగా తిరిగి వస్తే వారేవిజేత అని చెప్పింది కాకి. ఆ మాట అంటూనే కాకి సర్రున ఎగిరి మొదటి రెండు చెట్లను చుట్టేసి, మర్రి చెట్టుకొమ్మల్లోకి వఎగిరి, తన విశాలమైన రెక్కలు అడ్డు పడుతుండటం తో అక్కడే చిక్కుకుపోయింది, పిచ్చుక చిన్నదిగా ఉండటం వల్ల తన చిన్న రెక్కలతో చకచకా చెట్టు కొమ్మలలోనుంచి ఎగిరి వచ్చి పందెం గెలిచింది. ఆ రోజు మొదలుకుని కాకి ఎపుడూ ఇంకెవరినీ ఎగతాళి చేయలేదు..
Updated Date - May 29 , 2024 | 05:33 AM