ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుండె మర్చిపోయింది

ABN, Publish Date - Mar 18 , 2024 | 10:56 PM

అనగనగా ఒక ద్వీపం. అక్కడ ఆపిల్‌, జామ, సపోటా లాంటి పండ్ల చెట్లు ఉండేవి. కొన్ని కిందపడిపోయిన పండ్లను ఓ మొసలి తినేది. తన భార్యకూ తీసుకెళ్లేది. ఒక రోజు కింద పండ్లు ఏమీ లేవు. ఆపిల్‌ చెట్టుమీద ఓ కోతి కనపడింది. ఓ పండును ఇవ్వమని అడిగింది. వెంటనే కోతి ఒక ఆపిల్‌ను విసిరేసింది.

అనగనగా ఒక ద్వీపం. అక్కడ ఆపిల్‌, జామ, సపోటా లాంటి పండ్ల చెట్లు ఉండేవి. కొన్ని కిందపడిపోయిన పండ్లను ఓ మొసలి తినేది. తన భార్యకూ తీసుకెళ్లేది. ఒక రోజు కింద పండ్లు ఏమీ లేవు. ఆపిల్‌ చెట్టుమీద ఓ కోతి కనపడింది. ఓ పండును ఇవ్వమని అడిగింది. వెంటనే కోతి ఒక ఆపిల్‌ను విసిరేసింది. అది ఎంతో రుచిగా ఉందని.. తన భార్యకోసం కూడా ఓ పండును ఇవ్వాలని కోరింది. ఆ కోతి అలానే చేసింది. మొసలి ఆ పండును తనభార్యకు ఇచ్చింది. ‘ఎంత మధురమైన పండో’ అనుకున్నవి.

అలా పండ్లకోసం వచ్చిన మొసలికి ఆపిల్‌ పండ్లమీద మక్కువ పెరిగింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. ప్రతిరోజూ ఆపిల్‌ పండ్లను ఇస్తుంటే ఇంటికి తీసుకెళ్లేది మొసలి. ఒక రోజు కోతి కనపడలేదు. ఆ తర్వాత రెండు రోజులకు కనపడింది. ‘అయ్యో.. ఎక్కడికెళ్లావ’ని మొసలి బాధను నటించింది. ‘మా ఇంటికి రమ్మని .. నా భార్య పిలిచింది. నీకు మంచి ఆహారం పెట్టాలి. ఎందుకంటే నువ్వు మాకు ఆపిల్‌ పండ్లు ఇచ్చావు కదా’ అన్నది. కోతి తెగ సంబరపడింది.

మరుసటి రోజు మొసలి గట్టు దగ్గరకు వచ్చింది. కోతి రెండు ఆపిల్‌ పండ్లతో చెట్టుమీద నుంచి ఎగిరి మొసలి మీద కూర్చుంది. అలా నీళ్లలో సగం ప్రయాణం చేశాక.. మొసలి తన బుద్ధిని బయటపెట్టింది. ‘ఇన్ని ఆపిల్‌ పండ్లు తిన్న నువ్వు ఎంత రుచిగా ఉంటావో. ముఖ్యంగా మా ఆవిడకు నీ గుండె కావాలి’ అన్నది మొసలి. క్షణాల్లో కోతికి విషయం అర్థమైంది. మాయదారి మొసలి మాయ చేసిందే అనుకుంది. ‘అయ్యో.. మొసలి బావా. ఎంత తప్పు చేశావు? ముందే చెప్పి ఉంటే ఆ ఆపిల్‌ చెట్టుకు వేలాడ తీసిన గుండెను తెచ్చేదాన్ని కదా.. ఎంత అన్యాయం. ఒకమాట చెప్పాలి కదా’ అన్నది. ‘అయ్యో.. వెనక్కి వెళ్దాం. ఆ గుండె కోసం’ అన్నది మొసలి. ‘నీ భార్యతో మాట్లాడాక చూద్దాం’ అన్నది కోతి. ‘నీ గుండెతో రాకుంటే అంతే నా సంగతి. ఆలస్యం అయినా వెనక్కి వెళ్దాం’ అంటూ వెనక్కి తిరిగింది మొసలి.

కబుర్లు చెప్పుకుంటూ మొసలిని కోతి వెనక్కి తీసుకెళ్లింది. తీరం వచ్చిందో లేదో కోతి చెంగుమని మొసలి మీద నుంచి ఎగిరి చెట్టుమీద కూర్చుంది. ‘హాహాహా..’ అంటూ గట్టిగా నవ్వింది. ‘ఎవరైనా గుండెను చెట్టుకు వేలాడదీస్తారా? నీదో మట్టి బుర్ర. నీ అమాయకత్వానికి జోహార్లు.. నీ మోసానికి నమస్కారాలు’ అంటూ మొసలిని దుయ్యబట్టింది కోతి. మొసలి తన తప్పిదానికి చింతిస్తూ వెనక్కి వెళ్లిపోయింది. అలా కోతి లౌక్యంతో బతికి బయటపడింది.

Updated Date - Mar 18 , 2024 | 10:56 PM

Advertising
Advertising