Story : పులి గోరు
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:04 PM
కృష్ణా పురంలో ఉండే కేశవానంద అనేస్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి, స్వామీ, నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను . ఎవరిని చూసినా చిరాకుగా ఉంటుంది నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి
కృష్ణా పురంలో ఉండే కేశవానంద అనేస్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి, స్వామీ, నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను . ఎవరిని చూసినా చిరాకుగా ఉంటుంది నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి ఆ స్వామీజీ నాయనా నీ కోపం చిరాకు తగ్గాలి అంటే నువ్వు అసలైన పులి గోరు మెడలో వేసుకోవాలి. పక్కనున్న అడవిలో ఒక పులి ఉంది దాని వద్దకు వెళ్లి నా పేరు చెప్పు నీకు గోరు ఇచ్చి పంపుతుంది. అన్నాడు సరే అని రమణ అడవికి వెళ్లి ఒక బక్కచిక్కిన ముసలి పులిని కలిసి, కేశవానంద స్వామి పేరు చెప్పి, తనకు గోరు కావాలని అడిగాడు. దానికి ఆ పులి, నాకు ముసలితనం వచ్చి, చూపు సిరిగా ఆనడంలేదు. నువ్వు నాకు రోజూ ఆహారం తెచ్చిస్తే నీకు గోరు ఇస్తాను ుఅన్నది దానికి సరేనన్న రమణ ప్రతిరోజూ మాంసం, చేపలు తీసుకెళ్లి పులికి ఇచ్చేవాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ పులి ఇక నేడో రేపో నేను చనిపోతాను. నేను చనిపోగానే నా గోళ్లు నువ్వు తీసుకెళ్లవచ్చు అని అదే రోజున ఆ పులి చనిపోయింది. పులి చనిపోవడం చూసి, చాలా బాధ పడిన రమణ స్వామీజీ వద్దకు వచ్చి, దుఃఖ పడ్డాడు అది చూపిన స్వామీజీ ‘ఇపుడు చనిపోయిన పులి మీద ఎంత జాలి, ప్రేమ చూపిస్తున్నావో, అదే ప్రేమ నీతోటి మనుషుల మీద కూడా చూపించు. నీ కోపం, చిరాకు ఇట్టే తగ్గుతాయి’ అని చెప్పాడు ఆ రోజు నుండి రమణ చుట్టూ ఉన్న అందరిలో మంచిని చూడసాగాడు. త్వరలోనే అతనికి చీటికి మాటికి కోపం రావడం అనే సమస్య తగ్గిపోయింది.
Updated Date - Aug 29 , 2024 | 11:04 PM