ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వంకాయ కూర!

ABN, Publish Date - May 01 , 2024 | 11:12 PM

శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక రోజు బ్రహ్మాండమైన విందు భోజనం తిన్నారంతా. అందులో తెనాలి రామకృష్ణ ఉన్నారు. కూరలన్నింటిలో వంకాయ కూర బావుందని చాలామంది మెచ్చుకున్నారు.

శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక రోజు బ్రహ్మాండమైన విందు భోజనం తిన్నారంతా. అందులో తెనాలి రామకృష్ణ ఉన్నారు. కూరలన్నింటిలో వంకాయ కూర బావుందని చాలామంది మెచ్చుకున్నారు. రాజు పొంగిపోయారు. తెనాలి రామకృష్ణ ఇంటికి వెళ్లి తన భార్యతో ఈ విషయం చెప్పారు. ఆమెకు వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే ఆ కూరగాయలు కావాలని అడిగింది. ‘తెలివి తక్కువ దానా.. రాజుగారికి తెలియకుండా దొంగిలించామనుకో. దొరికామనుకో శిక్షనే’ అన్నాడు. తన భార్య మొండికి వేసే సరికి చివరకు సరేనన్నాడు. తెనాలి రామకృష్ణ రాజ్యంలోకి వెళ్లి ఎవరూ లేని సమయంలో వాటిని దొంగిలించి తీసుకొచ్చాడు. ఇంట్లో తన భార్య సంతోషపడింది. కూర చేసింది. ఆ సమయంలో కొడుకు ఆరుబయట నిద్రపోతున్నాడు. ‘అబ్బాయిని పిలుచుకురండి’ అన్నది. బక్కెట్‌ నీళ్లను తన కొడుకుమీద పోశాడు. నిద్రలో ఉండే తన కొడుకు ఉలిక్కిపడి లేచాడు. ‘వాన వస్తోంది లోపలికి వెళ్లు’ అన్నాడు తెనాలి రామకృష్ణ. కుటుంబమంతా వంకాయ కూర తిన్నారు.

ఉదయాన్నే రాజుగారి పెరడులో వంకాయలు లేనిది చూసి భటులు ఆయనకు చెప్పారు. ఎవరో దొంగతనం చేశారని సెలవిచ్చారు. తీవ్రంగా ఆలోచించారు. ‘తెనాలి రామకృష్ణగారు వేళకాని వేళలో వచ్చారు. ఇంటికి వెళ్తుంటే చూశాను’ అన్నాడో భటుడు. ‘దొరికాడు దొంగ’ అన్నాడు రాజుగారు. తెనాలి రామకృష్ణ, తన భార్యను పిలిపించారు. తెనాలి రామకృష్ణ కొడుకును కూడా పిలిపించాడు. ‘బాలుడు కాబట్టి నిజమే చెబుతాడు. నిన్న రాత్రి ఏమి తిన్నావు’ అన్నాడు. ‘వంకాయ కూర రాజుగారు. రుచి భలే ఉంది’ అంటూనే సభలో అందరూ నవ్వారు. రామకృష్ణ ఇంత పని చేశాడా? అన్నారు. ఇంతలో రామకృష్ణ కలగజేసుకుని.. ‘మహాప్రభూ.. మా వాడికి కలలు ఎక్కువ. కలలో తిన్నానని చెబుతున్నాడేమో. ఒక్కసారి అడగండి. నిన్న వానపడుతోంది కదా?’ అని. ఆ కుర్రోడు ‘అవును. నిన్న వాన పడింది. నిద్రలేచి వంకాయ కూర తిన్నా’ అన్నాడు. అంతలో తెనాలి రామకృష్ణ ఇలా అన్నారు.. ‘అయ్యా.. నిన్న వానలేదు. వాతావరణం పొడిగా ఉంది. మా వాడికి కలలు వస్తుంటాయి ఇలా’ అన్నాడు. ‘నిన్న వానపడింది కదా బాగా’ అన్నాడు బాలుడు. ‘నేను అనుకున్నది తప్పు. పొరబడ్డాను రామకృష్ణ’ అన్నారు రాజుగారు.

Updated Date - May 01 , 2024 | 11:20 PM

Advertising
Advertising