ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎవరు రాజు?

ABN, Publish Date - Mar 15 , 2024 | 11:02 PM

ఒక అడవిలో సింహం ఉండేది. తనే రాజుగా ప్రకటించుకుంది. ప్రతిరోజూ తన దగ్గరకే జింకలు, తోడేళ్లు, పందులు.. ఇలా రోజూ ఒకటి ఆహారంకోసం రావాలని ఆజ్ఞాపించింది. దీంతో జంతువులన్నీ నిరసించాయి. అయినా రాజుగారు ఆజ్ఞ కాబట్టి తప్పలేదు. కుందేలు లాంటి జంతువులు వెళ్లినపుడు సింహం కోప్పడేది.

ఒక అడవిలో సింహం ఉండేది. తనే రాజుగా ప్రకటించుకుంది. ప్రతిరోజూ తన దగ్గరకే జింకలు, తోడేళ్లు, పందులు.. ఇలా రోజూ ఒకటి ఆహారంకోసం రావాలని ఆజ్ఞాపించింది. దీంతో జంతువులన్నీ నిరసించాయి. అయినా రాజుగారు ఆజ్ఞ కాబట్టి తప్పలేదు. కుందేలు లాంటి జంతువులు వెళ్లినపుడు సింహం కోప్పడేది. అడవిలోకి వేటకు వెళ్లి జంతువులను భయభ్రాంతులకు గురిచేసేది. దీంతో సింహంతో ఏదోటి మాట్లాడాలని అనుకున్నాయి జంతువులు.

ఆ రోజే ఆ అడవిలోకి మదపుటేనుగు వచ్చింది. ఈ అడవికి నేనే రాజును అన్నది. మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అసలే సింహం బాధకు చస్తోంటే.. ఇదో తలనొప్పి అనుకున్నాయి. విషయం ఏనుగుకు నక్క చెప్పింది. ‘అయినా ఈ అడవిలో ఆ సింహాన్ని కొట్టే పరక్రమం ఎవరికి ఉంది. ఊరికే పొడవు, ఎత్తు, బలం ఉంటే ఏం లాభం? బుర్ర ఉండొద్దా’ అని ఉడికించింది ఏనుగును. దీంతో ఏనుగు ఇలా అంది.. ‘ఈ అడవికి నేనే రాజును. ఎవరు వస్తారో చూస్తా’ అన్నది. దీంతో జంతువులన్నీ ఏకమయ్యాయి. సింహం దగ్గరకు వెళ్లాయి. నేనే రాజు అంటూ రెండు ప్రగల్భాలు పలికాయి.

ఈ గొడవ కాస్త సద్దుమనగలేదు, దీంతో జంతువలకు ఇబ్బంది కలిగింది. నేనంటే నేను గొప్ప అనుకున్నాయి. ఇంతలో నక్క వచ్చి.. ‘మీరు గొప్పవారు అని అనుకోవటం కాదు. అడవికి రాజు ఒకరే ఉండాలి’ అన్నది. ఏనుగుతో ‘నువ్వు జింకను పట్టుకుని రా’ అన్నది. సింహంతో ‘నువ్వు పెద్ద బండరాయిని తీసుకురా’ అన్నది. అది కూడా సాయంత్రంలోపు చేయాలి అన్నది. రెండూ వేగంగా వెళ్లాయి. రెండూ వాటికి చెప్పిన పనులు చేయలేక వెనక్కి వచ్చాయి. నక్క వారితో ఇలా అన్నది.. ‘మీరు ఎవరూ మీకు అప్పగించిన పనిని చేయలేకపోయారు. అంటే ఇద్దరూ కొట్లాడుకుని ఉపయోగం లేదు. జంతువులను సమానంగా చూడటం నేర్చుకోండి’ అన్నది. ఆ తర్వాత ఏనుగు ‘నేనే రాజు’ అనలేదు. సింహం అలా రాజుగా ఉండిపోయింది.

Updated Date - Mar 15 , 2024 | 11:02 PM

Advertising
Advertising