ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

House : లవ్లీ లివింగ్‌రూమ్‌!

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:47 AM

ఇంటికి వచ్చిన అతిథులను ముందుగా ఆకట్టుకునేది లివింగ్‌రూమ్‌. కుటుంబ సభ్యులు కూర్చుని కబుర్లు చెప్పుకునే ప్రదేశం కూడా ఇదే. మరి అలాంటి లివింగ్‌ రూమ్‌ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే నిపుణులు ఇస్తున్న సలహాలు ఇవి...

ఇంటికి వచ్చిన అతిథులను ముందుగా ఆకట్టుకునేది లివింగ్‌రూమ్‌. కుటుంబ సభ్యులు కూర్చుని కబుర్లు చెప్పుకునే ప్రదేశం కూడా ఇదే. మరి అలాంటి లివింగ్‌ రూమ్‌ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే నిపుణులు ఇస్తున్న సలహాలు ఇవి...

  • ఫోకల్‌ పాయింట్‌

గదిలో వస్తువులను ఎలా అమర్చుకోవాలో ముందుగా ప్లాన్‌ చేసుకోవాలి. దీనివల్ల గందరగోళానికి తావులేకుండా సర్దుకునే వీలుంటుంది. వస్తువులు అమర్చుకున్నాక గది ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ముందుగా లివింగ్‌రూమ్‌ ఫోకల్‌ పాయింట్‌ని ఎంపిక చేయాలి. ఫోకల్‌ పాయింట్‌ పవర్‌ని తక్కువగా అంచనా వేయకూడదు. ఇంట్లో అడుగుపెట్టగానే ముందుగా అక్కడే అందరి దృష్టి పడుతుంది. ఈ ప్రదేశంలో టీవీని అమర్చుకోవచ్చు. లివింగ్‌రూమ్‌లోనే పుస్తకాల అర లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. సోఫా వెనకాల ఏదైనాపెయింటింగ్‌ వేలాడదీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో లైటింగ్‌ ఎక్కువగా పడేలా చూసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది.


  • ఫర్నిచర్‌ అమరిక

గది విస్తీర్ణం ఆధారంగా ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకోవాలి. గది విస్తీర్ణం చిన్నగా ఉంటే ఒక సోఫా, ఒక కుర్చీ, టేబుల్‌ను పెట్టుకోవచ్చు. అదే గది పెద్దగా ఉంటే కాఫీ టేబుల్‌, కొన్ని స్టయిలి్‌షగా ఉండే కుర్చీలను కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్నిచర్‌ను గది గోడలకు ఆనించి పెట్టకూడదు. ఎంత దూరంగా పెడతారనేది గది వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. లివింగ్‌రూమ్‌ చిన్నగా ఉంటే ఫర్నిచర్‌కు గోడకు మధ్య కొన్ని అంగుళాల స్థలం వదిలేసి ఫర్నిచర్‌ను అమర్చుకోవాలి.

ఇలా కొంత స్థలం వదిలేస్తే గది విశాలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ లివింగ్‌రూమ్‌ విశాలంగా ఉంటే గది మధ్యలో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఫర్నిచర్‌కు, గోడలకు మధ్య కొన్ని అడుగుల దూరం ఉండి లివింగ్‌రూమ్‌ చాలా విశాలంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో ఫర్నిచర్‌ అమరిక బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి.

మరీ పెద్ద ఫర్నిచర్‌ను ఒకచోట, చిన్న ఫర్నిచర్‌ను ఒకచోట పెట్టకూడదు. గదిలో ఒక మూలకు వచ్చేలా కూడా అమర్చుకోకూడదు. రకరకాల షేపుల్లో ఉన్న ఫర్నిచర్‌ను ఎంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే నడిచేందుకు ఇబ్బంది పడకూడదు. కాఫీ టేబుల్‌కు కుర్చీలకు మధ్య నడుచుకుంటూ వెళ్లేలా స్థలం ఉండేలా చూసుకోవాలి.


  • టీవీ ప్లేస్‌మెంట్‌

టీవీ సైజును బట్టి ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవాలి. గదిలో సూర్యరశ్మి పడని చోట టీవీ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబసభ్యులు ఎక్కువగా అటూ ఇటూ తిరిగే చోట టీవీ పెట్టకూడదు. లివింగ్‌రూమ్‌లోని ఫర్నిచర్‌కు ఎదురుగా ఉండేలా చూసుకుంటే కూర్చుని చూసే వారికి కంఫర్ట్‌గా ఉంటుంది.

ఫర్నిచర్‌ కింద రగ్స్‌ వేసుకుంటే ఆకట్టుకునేలా గది తయారవుతుంది. గది మొత్తం కాకుండా ఫర్నిచర్‌ అమర్చుకున్న చోట మాత్రమే రగ్‌ వేయాలి. ఫర్నిచర్‌ చుట్టూ నడిచేందుకు ఉన్న స్థలంలో రగ్‌ వేయకూడదు. ఇందుకోసం సైజుకు అనుగుణంగా రగ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

  • కాఫీ టేబుల్‌...

కాఫీ టేబుల్‌గా చిన్న టీపాయ్‌ లాంటిది పెడుతుంటారు. కానీ కాస్త పెద్దగా ఉండేలా చూసుకుంటేనే మంచిది. కూర్చునే చోట మధ్యలో కాఫీ టేబుల్‌ పెట్టుకోవాలి. అతిథులకు కాఫీ, టీ సర్వ్‌ చేయడానికి అనువుగా ఉంటుంది. మ్యాగజైన్‌, పేపర్‌లాంటివి ఈ టేబుల్‌పై పెట్టుకోవచ్చు.

  • లైటింగ్‌ విషయంలో...

లివింగ్‌రూమ్‌ ప్రత్యేకంగా కనిపించాలంటే లైటింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లోర్‌ల్యాంప్స్‌, టేబుల్‌ ల్యాంప్స్‌, ఓవర్‌హెడ్‌ లైటింగ్‌... ఏదైనా ఎంచుకోవచ్చు. ఫ్లోర్‌ ల్యాంప్‌ అయితే సోఫా దగ్గర, కుర్చీ వెనకాల పెట్టుకోవాలి. టేబుల్‌ ల్యాంప్‌ అయితే షెల్ప్‌ల దగ్గర అమర్చుకోవాలి. మొత్తంగా లివింగ్‌రూమ్‌ అంతటా లైటింగ్‌ సమంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ ధరలో లభ్యమయ్యే ల్యాంప్‌ షేడ్‌లను కొనుగోలు చేసి వాటికి రంగులు వేసుకుని అమర్చుకోవడం వల్ల ఆకట్టుకునేలా తీర్చిదిద్దుకోవచ్చు లివింగ్‌ రూమ్‌లో అనవసరమైన వస్తువులకు చోటివ్వకూడదు. అప్పుడే మీరు కోరుకున్న ఆకట్టుకునే లివింగ్‌రూమ్‌ సొంతమవుతుంది.

Updated Date - Oct 05 , 2024 | 12:48 AM