ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Makeup : నవయవ్వనంగా...

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:38 AM

మేకప్‌తో వృద్ధాప్య ఛాయలను కొంత మేరకు దాచవచ్చు. అయితే అందుకోసం సరైన మేకప్‌ ఉత్పత్తులను, మెలకువలను అనుసరించాలి. వయసును దాచే మేకప్‌ టిప్స్‌ ఏవంటే...

మేకప్‌తో వృద్ధాప్య ఛాయలను కొంత మేరకు దాచవచ్చు. అయితే అందుకోసం సరైన మేకప్‌ ఉత్పత్తులను, మెలకువలను అనుసరించాలి. వయసును దాచే మేకప్‌ టిప్స్‌ ఏవంటే...

అతి అనర్థం: వృద్ధాప్య ఛాయలు దాచడం కోసం అతిగా మేకప్‌ వేస్తే అసలుకే మోసం వస్తుంది. మేకప్‌ ముడతల్లో ఇంకిపోయి, చర్మం మీది సన్నని గీతలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మేకప్‌ మరీ మందంగా కాకుండా, వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి.

లిక్విడ్‌ మేకప్‌: వయసు పైబడేకొద్దీ చర్మం తేమ కోల్పోయి, పొడిబారుతుంది. కాబట్టి చర్మం మృదువుగా కనిపించడం కోసం లిక్విడ్‌ మేకప్‌ ఉత్పత్తులు ఎంచుకోవాలి. బ్లషెస్‌, బ్రాంజర్స్‌ కూడా ద్రవ రూపంలోనివే ఎంచుకోవాలి.

మాయిశ్చరైజర్‌: ప్రతి రాత్రీ నిద్రకు ముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా అప్లై చేసుకోవడంతో పాటు ఉదయం మేకప్‌కు ముందు టింటెడ్‌ మాయిశ్చరైజర్‌ను పూసుకోవాలి.

సహజ మెరుపు: పైబడే వయసుతో చర్మం సహజసిద్ధమైన మెరుపును కోల్పోతుంది. కాబట్టి బ్లషర్‌, బ్రాంజర్ల వాడకాన్ని తగ్గించి, బదులుగా లిక్విడ్‌ హైలైటర్‌ను పెంచాలి.

ఐ మేకప్‌: తక్కువ ఐమేకప్‌ చేసుకోవాలి. ముదురు రంగు, స్మోకీ కలర్స్‌కు బదులుగా తేలికపాటి రంగులను ఎంచుకోవాలి. ముదురు రంగు ఐలైనర్‌, ఐ షాడోలతో వయసుకు మించి కనపడతారు. కాబట్టి తేలిక రంగులే ఎంచుకోవాలి.

న్యాచురల్‌ లిప్‌స్టిక్‌: బోల్డ్‌ కలర్స్‌కు బదులుగా న్యూడ్‌ లేదా లేత రంగు లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి. లిప్‌గ్లాస్‌లు, చమ్కీల్లా మెరిసే లిప్‌స్టిక్‌ల జోలికి వెళ్లకూడదు. లిప్‌లైన్‌ కూడా సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. అదనపు లిప్‌స్టిక్‌ను బ్లాటింగ్‌ పేపర్‌తో తొలగించి, పల్చగా పౌడర్‌ అద్దుకోవాలి.

ఐ మేకప్‌: కృత్రిమ కనురెప్పలకు బదులుగా నాణ్యమైన మస్కారా ఉపయోగించాలి. ఐ షాడో కూడా లేత గులాబీ రంగులో ఉండేలా చూసుకోవాలి. మస్కారా, ఐలైనర్‌ పొదుపుగా వాడుకోవాలి.

Updated Date - Jun 01 , 2024 | 04:38 AM

Advertising
Advertising