ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konidela Niharika : వదిన కోసం మేము మారాం

ABN, Publish Date - Aug 04 , 2024 | 01:26 AM

మెగా కుటుంబం నుంచి నటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన నిహారిక కొణిదెల... ‘కమిటీ కుర్రాళ్లు’తో నిర్మాతగా మారారు.ఈ సందర్భంగా తాను చేస్తున్న ప్రాజెక్టులు... వ్యక్తిగత జీవిత విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

సండే సెలబ్రిటీ

మెగా కుటుంబం నుంచి నటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన నిహారిక కొణిదెల... ‘కమిటీ కుర్రాళ్లు’తో నిర్మాతగా మారారు.ఈ సందర్భంగా తాను చేస్తున్న ప్రాజెక్టులు... వ్యక్తిగత జీవిత విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

నిర్మాతగా...

నేను ఇంతకుముందు ఓటీటీ కోసం కొన్ని సీరియల్స్‌ నిర్మించాను. వాటికి ఎంత శ్రమపడ్డామో, ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రానికి కూడా అంతే శ్రమపడ్డాం. బడ్జెట్స్‌లో మార్పు వచ్చి ఉండచ్చు. కానీ వర్క్‌పరంగా పెద్ద తేడా ఏమీ లేదు. నాకు చాలా మంచి టీమ్‌ దొరికింది. షూటింగ్‌కు వెళ్లకపోయినా ఏం తీశారో సాయంత్రానికి ఫుటేజ్‌ వచ్చేస్తుంది. ఇక నటన విషయానికివస్తే... తమిళంలో ఒక సినిమా చేస్తున్నా. తెలుగులో ఒక సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది.

24 క్రాఫ్ట్స్‌లో...

నాకు ప్రొడక్షన్‌, యాక్టింగ్‌తో పాటు ఎడిటింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. ఒక సినిమా హిట్‌ అవ్వాలన్నా, ఫ్లాప్‌ కావాలన్నా.. ఎడిటింగ్‌ ప్రముఖమైన పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతాను. ఎడిటర్స్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది.


నటిగా నేర్చుకున్నది...

ఏకాగ్రతతో పని చేయాలని ఒక నటిగా నేర్చుకున్నా. మనకు ఫోకస్‌ ఉంటే... నచ్చిన విషయాన్ని పొందగలుగుతాం. ఉదాహరణకు నేను ఇప్పటికీ వర్క్‌షా్‌పలకు వెళ్లి నటించటం ఎలాగో, మాట్లాడటం ఎలాగో తెలుసుకుంటూ ఉంటా. స్ర్కిప్టుల విషయంలో నేను చేసేది ఏంలేదు. నా నటన చూసి ‘ఈ అమ్మాయి బాగా చేస్తోంది. మనం ఒక పాత్ర రాయాలి’ అని రైటర్స్‌ అనుకోవాలి. వాళ్లు అలా అనుకోవాలంటే... నేను బాగా నటించాలి.

క్లిష్టమైన సమయం...

‘కమిటీ కుర్రాళు’ ప్రారంభించినప్పుడు ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. 11 మంది కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నానంటే... నమ్మలేనట్లు చూసేవారు. టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత మమ్మల్ని నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నాకే కాదు.. ఎవరికైనా ఇతరులను నమ్మించటానికి చాలా సమయం పడుతుంది.

ఎమోషనల్‌ పర్సన్‌ని...

నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. కానీ నా ఎమోషన్స్‌ బయటకు కనపడనివ్వను. ఇక నాకు ఎమోషనల్‌ సపోర్టు అంటే మా నాన్నే. చాలామంది నమ్మకపోవచ్చు కానీ.. నాన్న (నాగబాబు) తన విషయంలో ఎమోషనల్‌గా ఉండరు. తాను ప్రేమించేవాళ్లను ఏదైనా అంటే ఊరుకోరు. నేనూ అంతే. నాన్న తన ఎమోషన్స్‌ను పక్కనపెట్టి నాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


ఆ విధంగా...

సోషల్‌ మీడియా ద్వారా మన వ్యక్తిగత జీవితంలోకి దూసుకువచ్చేస్తారు. ఇప్పటిదాకా నా మీద అంత ఘోరమైన ట్రోల్స్‌ రాలేదనుకోండి. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే. నా దృష్టిలో సోషల్‌ మీడియాకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒక పార్శ్వం... చాలా మంచిది. మనకు ఎంతో ఉపకరిస్తుంది. దాన్ని తగినట్లుగా వాడుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నేను ఎప్పుడూ కామెంట్స్‌ సెక్షన్‌ చూడను. ఎందుకంటే దానిలో విపరీతమైన నెగిటివీటి ఉండొచ్చు.

వెంటాడే భయం...

నేను ప్రేమించే వ్యక్తులు దూరమవుతారనేది నన్ను ఎక్కువగా భయపెడుతుంది. ఇక నాకు బల్లులంటే విపరీతమైన భయం.

సర్దుకుపోవాలి...

కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు మనం సర్దుకుపోవాలి. వాళ్లను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. వదిన (లావణ్య త్రిపాఠి) మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆహ్వానించాం. తను చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఉంది. కానీ ఉత్తరాది అమ్మాయి కావడంతో తన అలవాట్లు భిన్నంగా ఉండేవి. వాటికి అనుగుణంగా మేము మార్పులు చేసుకున్నాం. నా ఉద్దేశంలో కొత్త వ్యక్తి మనింటికి వచ్చినప్పుడు రెండు అడుగులు వెనక్కి వేస్తే తప్పేంలేదు. నేను, వదినా మంచి ఫ్రెండ్స్‌. గంటల తరబడి మాట్లాడుకుంటాం.


బయట తినను

నేను ఎక్కువగా ఇంట్లో అమ్మ వండినవే తింటాను. బయట తినను. పప్పుచారు, చికెన్‌ అంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు వంట నేనే చేస్తుంటాను.

అతి ముఖ్యమైనది...

ఈతరం అమ్మాయిలకు గౌరవం చాలా ముఖ్యం. కొందరు అమ్మాయిలను అలుసుగా తీసుకుంటారు. నా ఉద్దేశంలో చదువును బట్టి జ్ఞానం రాదు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గౌరవించేవాళ్లు... ఎవరినైనా గౌరవించగలరు. తల్లితండ్రులు తమ పిల్లలకు ఈ తరహా సంస్కృతిని నేర్పాలి.

- సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Aug 04 , 2024 | 01:26 AM

Advertising
Advertising
<