Share News

Dry Skin or Sensitive Skin : వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:21 PM

వేసవిలో చర్మం నిగారింపుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్ ఉంటాయి. ఇది స్కిన్ టోన్ పంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

Dry Skin or Sensitive Skin : వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!
Dry Skin

వాతావరణంలో మార్పులు ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వేసవి తాపం నుంచి, కాలుష్యం కారణంగా చర్మం (Skin) ఇబ్బందిలో పడుతూ ఉంటుంది. దీనితో ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నా కూడా నిగారింపు తగ్గుతుంది. సహజంగా నిగారింపు రావాలంటే కూడా కాస్త శ్రమ తీసుకోవాల్సిందే.. దీనికి పూలలో మనం బాగా ఇష్టపడే గులాబీల నీటిని అదే రోజ్ వాటర్‌ను వాడటం వల్ల చర్మానికి మెరుపు, సున్నితత్వం రెండూ ఉంటాయి. చాలా సంవత్సరాలుగా రోజ్ వాటర్‌ను సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇది గులాబీల రేకుల నుంచి సేకరించినదే కావడం వల్ల సహజంగానే సున్నితత్వాన్ని, కమ్మని సువాసనను కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ సహజ లక్షణాల వల్ల వివిధ చర్మ రకాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

వేసవిలో (summer) చర్మం నిగారింపుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్ ఉంటాయి. ఇది స్కిన్ టోన్ పంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్‌ను దూరం చేస్తుంది.

రక్త సరఫరాకు కూడా సరిచేస్తుంది. కుంకుమ పువ్వును తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నీటితోపాటు కొబ్బరి నూనెను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయలి. వారం పాటు ఇలా చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.

మొటిమలు మచ్చలు పోవాలంటే ..

1. ముల్తానీ మట్టి కూడా బాగా పనిచేస్తుంది. ముఖం అందంగా మెరవాలంటే మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఇది మచ్చలను తొలగించి చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా పసుపు, గంధం పొడి వేసి పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి కట్టాలి.


ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

2. టొమాటోలు వేసవిలో ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. ఇందులోని లైకోపీన్‌ చర్మానికి సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.

రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..!

3. అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-3లు పుష్కలంగా ఉంటాయి, అవకాడోలు చర్మం మీద సహజ తేమను నిలుపుతాయి. అలాగే వేసవిలో ఆరోగ్యకరమైన, హైడ్రేటెడ్ ఛాయను ఇస్తుంది.

4. బ్లూబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, ఆంథోసైనిన్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇవి చర్మాన్ని రక్షించడంలో ముందుంటాయి. విటమిన్లు ఎ, సి, ఇ విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి మంచి ఎంపికలు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 01:24 PM