ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Healthy Fruits : బానపొట్ట బాధిస్తోందా?

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:21 AM

బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడంవల్ల పొట్ట గుండ్రంగా పెద్దగా కనిపిస్తుంది. దీనినే బానపొట్టగా పరిగణిస్తుంటారు.

బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడంవల్ల పొట్ట గుండ్రంగా పెద్దగా కనిపిస్తుంది. దీనినే బానపొట్టగా పరిగణిస్తుంటారు. దీనివల్ల శరీరాకృతి అందంగా కనిపించదు. అంతేకాకుండా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు, ఇతర పోషకాలు అధికంగా ఉన్న పండ్లు తరచూ తినడంవల్ల బానపొట్టను మెల్లగా తగ్గించవచ్చు. ఆ పండ్ల వివరాలు...

యాపిల్‌

యాపిల్‌ పండులో చాలా తక్కువ క్యాలరీలు, అత్యధికంగా పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి పొట్టలోని కొవ్వులను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్‌ పండు తినడం వల్ల అందులోని పెక్టిన్‌ సమ్మేళనాలు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల ఆకలి తగ్గి ఆహారం తినాలనిపించదు. దీంతో పొట్టలోని కొవ్వు కరగడం మొదలవుతుంది.

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్ష, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ పండ్లలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్‌, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల కొవ్వులకు సంబంధించిన జీవక్రియలు వేగంగా జరుగుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

నారింజ

ఈ పండులో క్యాలరీలు ఉండవు. సి విటమిన్‌, బీటా కెరొటిన్లు, ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లెవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలోని అన్ని రకాల కొవ్వులను వేగంగా కరిగిస్తాయి. ప్రతిరోజూ కనీసం రెండు నారింజ పండ్లు తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.


అవకాడో

దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపులో ఇన్‌ఫ్లమేషన్‌ని నివారిస్తాయి. కొవ్వులను కరిగించే హార్మోన్లను ఉత్తేజితం చేస్తాయి. అవకాడోలోని విభిన్నమైన పీచుపదార్థాలు పొట్టను పరిశుభ్రం చేస్తాయి. ప్రతిరోజూ ఈ పండు తినడం వల్ల బానపొట్ట నుంచి విముక్తి పొందవచ్చు.

బొప్పాయి

ఈ పండులో పపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కడుపులో ఎటువంటి పదార్థాలు నిల్వ ఉండకుండా చేస్తుంది. బొప్పాయిలోని పీచు పదార్థాలు ప్రేగులను పరిశుభ్రం చేస్తాయి. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తినడం వల్ల పొట్టలోని కొవ్వులు క్రమంగా కరిగిపోతాయి.

పంపర పనస

ఈ పండులో కూడా సిట్రస్‌ జాతి ఎంజైమ్‌లు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని తగ్గించి రక్తంలో చక్కెరలు పెరగకుండా చేస్తాయి. దీనివల్ల శరీరం పూర్తిస్థాయిలో శక్తిని వినియోగించుకుంటుంది. పంపర పనస పండు రసం తాగడం వల్ల ఉదరంలో నిల్వ ఉన్న కొవ్వులు క్రమంగా కరిగి బానపొట్ట తగ్గుతుంది.


పుచ్చపండు

దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండు తిన్నవెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పుచ్చపండులో ఉండే ఆర్జినైన్‌ అనే అమైనోయాసిడ్‌ కొవ్వులను వేగంగా కరిగిస్తుంది. రోజుకి రెండు కప్పుల ముక్కలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది. ఆకలి నియంత్రణలో ఉండి బానపొట్ట కరుగుతుంది.

దానిమ్మ

దానిమ్మ గింజల్లో పాలిఫెనాల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో కడుపులోని కొవ్వులు కూడా కరిగిపోతాయి.


అనాస

ఈ పండులో బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది పొట్టలో పేరుకున్న కొవ్వులను కరిగిస్తుంది. జీర్ణాశయం పనితీరుని మెరుగుపరుస్తుంది. కడుపులో తయారయ్యే వాయువులను బయటికి పంపుతుంది. ఈ పండు తిన్నపుడు దీనికి ఉన్న అరుదైన తీయదనం వల్ల కొన్ని రోజుల వరకు ఇతర తీపి పదార్థాలను తినాలనిపించదు. శరీర బరువు క్రమంగా తగ్గి పొట్ట పరిమాణం మామూలు స్థాయికి వస్తుంది.

అరటి

అరటి పండులో అధికంగా పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో అదనంగా నీరు నిల్వ ఉండకుండా చేస్తుంది. దీనివల్ల శరీర భాగాల్లో చేరిన కొవ్వులన్నీ కరిగిపోతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే రెండు అరటిపండ్లు తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరమంతా తేలికగా ఉన్న భావన కలుగుతుంది.

Updated Date - Dec 14 , 2024 | 03:25 AM