ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chaitanya Reddy: అందర్నీ కడుపుబ్బా నవ్వించే డార్లింగ్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 01:19 AM

నిర్మాతలుగా ‘హను-మాన్‌’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్నారు కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య. లేటెస్ట్‌గా ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ‘డార్లింగ్‌’ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాతలుగా ‘హను-మాన్‌’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్నారు కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య. లేటెస్ట్‌గా ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ ‘డార్లింగ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉప శీర్షిక. అశ్వనీ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చైతన్య మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘కపుల్స్‌ మధ్య జరిగే సంఘటనలని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా. యూత్‌, ఫ్యామిలీ ఇలా..ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా సినిమాను దర్శకుడు తీర్చిదిద్దారు. ఇందులో కథానాయకుడి పాత్ర చాలా అమాయకంగా.. కథానాయిక పాత్ర చలాకీగా ఉండాలి. ఈ పాత్రలకి ప్రియదర్శి, నభానటేశ్‌ సరిపోతారని అనిపించి వారిని తీసుకున్నాం. సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లకీ సమ ప్రాధాన్యత ఉంటుంది. వినోదంతో పాటు భావోద్వేగాలని సమపాళ్లలో మిక్స్‌ చేసి తీసిన ఈ సినిమాలో.. హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే సన్నివేశాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. వివేక్‌ సాగర్‌ సంగీతం సినిమాకు స్పెషల్‌ హైలైట్‌. ‘హను-మాన్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్‌’ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం సస్పెన్స్‌’’ అని చెప్పారు.

Updated Date - Jul 07 , 2024 | 01:19 AM

Advertising
Advertising
<