ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nutrition: శక్తినిచ్చే లడ్డు

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:56 AM

కొన్ని సార్లు భోజనానికీ, భోజనానికీ మధ్యలో నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే పదార్థాలు తినాలి.

కొన్ని సార్లు భోజనానికీ, భోజనానికీ మధ్యలో నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే పదార్థాలు తినాలి. ఆ కోవకు చెందిన అల్పాహారాల్లో బలవర్ధకమైన ‘ఆప్రికాట్‌ లడ్డు’ ఒకటి. శక్తినిచ్చే ఈ లడ్లు ఎలా తయారు చేయాలంటే...

కావలసిన పదార్థాలు:

ఎండు ఆప్రికాట్స్‌- అర కప్పు

ఎండు ద్రాక్ష - అర కప్పు, బాదం - పావు కప్పు

వాల్‌నట్స్‌ - పావు కప్పు

పచ్చికొబ్బరి కోరు - 3 టేబుల్‌ స్పూన్లు

వెనిల్లా ఎసెన్స్‌ - కొన్ని చుక్కలు

అవిసె గింజల పొడి - 1 టేబుల్‌ స్పూను

దాల్చినచెక్క పొడి - 1 టేబుల్‌ స్పూను

తయారీ విధానం:

వెనిల్లా ఎసెన్స్‌ మినహా మిగతా పదార్థాలన్నీ మెత్తగా దంచి, కలుపుకోవాలి.

తర్వాత వెనిల్లా ఎసెన్స్‌ వేసి కలపాలి.

పై పదార్థాలన్నీ తీపిగానే ఉంటాయి కాబట్టి, అదనంగా చక్కెర కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీపి ఎక్కువ కావాలనిపిస్తే రెండు టీస్పూన్ల తేనె కలుపుకోవచ్చు.

చివర్లో లడ్డుగా చుట్టి ఎండు కొబ్బరి కోరులో దొర్లించాలి.

వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే కొన్ని వారాల వరకూ పాడవకుండా ఉంటాయి.

Updated Date - Dec 17 , 2024 | 04:56 AM