ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sonttikommu : అల్లం... అమృతం

ABN, Publish Date - Sep 28 , 2024 | 01:10 AM

తడిగా ఉన్న అల్లపు దుంపని ఆర్ద్రకం అంటారు. దీనినే శృంగవేరి అనికూడా పిలుస్తారు. ఎండిన అల్లానికి శోంఠి అని పిలుస్తారు. ఎండిన అల్లానికి కొమ్ములు ఉంటాయి కాబట్టి- దీనిని తెలుగులో శొంఠికొమ్ము అనటమూ ఉంది.

తడిగా ఉన్న అల్లపు దుంపని ఆర్ద్రకం అంటారు. దీనినే శృంగవేరి అనికూడా పిలుస్తారు. ఎండిన అల్లానికి శోంఠి అని పిలుస్తారు. ఎండిన అల్లానికి కొమ్ములు ఉంటాయి కాబట్టి- దీనిని తెలుగులో శొంఠికొమ్ము అనటమూ ఉంది. కర్ణాటకలోని శృంగేరీ ప్రాంతంలో అల్లం బాగా పండుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ’శృంగవేరగిరి‘ అన్నారు. శంకరాచార్యుల వారు తన పీఠాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. అదే శృంగేరిగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు.

  • లాభాలెన్నో...

అల్లానికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానముంది. స్థూలకాయం, వాపులు, అజీర్తి, మలబద్ధతలను తగ్గించటానికి దీనిని వాడతారు. గడ్డలు, ట్యూమర్లు ఏర్పడకుండా, రక్తం గడ్డకుండా రక్తప్రసారం మెరుగుపరచటంలో అల్లం కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతే కాదు.. మనం తినే పోషకాలు వంటబట్టడానికి.. వ్యాధినిరోధకశక్తి పెరగటానికి కూడా ఇవి ఉపకరిస్తాయి. ఇక అల్లాన్ని ఇతర పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • అల్లం తురుమును బెల్లం పాకం పట్టి ఉండలుగా చేసి చప్పరిస్తే- శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఊపిరి తీసుకొనే పద్ధతిలో మార్పు వస్తుంది. నాలుకపై ఏర్పడే పలుచని జిగురు పొర తొలగిపోయి రుచి తెలుస్తుంది. గొంతు శ్రావ్యత కూడా పెరుగుతుంది.

  • అల్లాన్ని పాలల్లో వేసి బాగా పొంగనిచ్చి.. ఉదయాన్నే తాగితే టీబీలాంటి జబ్బులు రావు.

  • అల్లం రసం, నిమ్మరసం కలిపి దానిలో తగినంత ఉప్పు వేసి తాళింపు పెట్టుకోవాలి. ఇలా తయారయిన పలుచటి చట్నీని అన్నంతో కలుపుకొని క్రమం తప్పకుండా తింటే కడుపులో ఉండే నుసి పురుగులు పోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.


  • ఎలా తినాలి?

అల్లాన్ని ఎలా తినాలనే విషయాన్ని క్షేమశర్మ- తన క్షేమకుతూహలంలో పేర్కొన్నాడు. క్షేమశర్మ చెప్పిన సూత్రం ప్రకారం- అల్లాన్ని- ‘‘భోజనాగ్రే సదాపథ్యం’’లో తినాలి. అంటే భోజనంలో మొదటి ముద్దగా తినాలి. అంతే కాదు. వంకాయ, కంద వంటి కూరలు ఆరగటం కష్టమవుతుంది. అందువల్ల వాటిలో అల్లాన్ని తప్పనిసరిగా కలపాలి. తేలికగా అరిగే బీర, పొట్ల, సొర, పాలకూర, తోటకూర వంటి వాటిలో అల్లాన్ని కలపాల్సిన అవసరం లేదు.

ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అల్లానికి వేడి చేసే స్వభావం ఉంది. అందువల్ల వేడి శరీర తత్వం ఉన్నవారు అల్లాన్ని పరిమితంగా తీసుకోవాలి. శరీరానికి వేడి కలిగించే వెల్లుల్లితో అసలు కలపకూడదు. అల్లం, వెల్లుల్లి - ఈ రెండు ఔషధాలు కూడా! వీటిని మితంగానే వాడాలి. అతిగా వాడితే ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Sep 28 , 2024 | 01:11 AM