Story : తగిన బుద్ధి
ABN, Publish Date - May 11 , 2024 | 11:29 PM
ఒక పట్టణంలో రాజు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడికి పల్లెలంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా చేపలు పట్టడం అతనికి అలవాటు. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. చేపలు పట్టడం కోసం మంచి నీటి కుంట అయినా మడుగు అయినా విపరీతంగా పాడు చేసేవాడు. రాళ్లు వేసేవాడు. చెట్ల కొమ్మలు వేసేవాడు.
ఒక పట్టణంలో రాజు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడికి పల్లెలంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా చేపలు పట్టడం అతనికి అలవాటు. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. చేపలు పట్టడం కోసం మంచి నీటి కుంట అయినా మడుగు అయినా విపరీతంగా పాడు చేసేవాడు. రాళ్లు వేసేవాడు. చెట్ల కొమ్మలు వేసేవాడు. ఇలా అతనికి చేయటం అతనికి సరదా.
ఒకరోజు తన పట్టణానికి దూరంగా యాభై కిలోమీటర్లు కారులో వెళ్లాడు. అక్కడ చిన్న వాగులు, వంకలు ఉన్నాయి. అక్కడ చేపలు పట్టాడు. ఆ తర్వాత ఒక మంచి నీటి కుంట దగ్గరకు వెళ్లాడు. అక్కడ చేపలు రుచిగా ఉంటాయని దారిన వెళ్లేవారు చెప్పారు. దీంతో అక్కడే కూర్చున్నాడు. ఎర తీసుకుని చేపలు పట్టడం ప్రారంభించాడు. ఒక్క చేప కూడా పడలేదు. దీంతో చాలా కోప్పడ్డాడు. తనలాంటి గొప్ప ఫిషర్‌మాన్‌కే చేపలు దొరకటం అవమానమే? అనుకున్నాడు మనసులో. మళ్లీ ప్రయత్నించాడు. చేపలు దొరకలేదు. ఎప్పటిలానే అప్రయత్నంగా ఆ మంచి నీటి కుంటలో కాళ్లు పెట్టాడు. మట్టి పైకి వచ్చినా అలానే నడిచాడు. చెట్ల కొమ్మలు, బండరాళ్లు అందులోకి వేశాడు.
చెట్లకొమ్మలు వేస్తున్నప్పుడు దారింటా ఓ రైతు చూశాడు. ‘నువ్వు ఎవరివి? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది పద్ధతి కాదు. ముందు దీన్ని శుభ్రం చేయి’ అన్నాడు. ‘నువ్వెరు చెప్పటానికి?’ అని అడిగాడు. ‘నేను ఈ ఊరివాన్ని. మంచి నీళ్లు ఇలా గలీజు పడుతున్నాయంటే ఊరుకుంటానా?’ అన్నాడు. ‘నేను చేపలు పట్టడానికి వచ్చాను. ఇక్కడి మంచి నీటి కుంటలో చేపలు రుచిగా ఉంటాయని విన్నాను’ అన్నాడు. ‘ఈ చిన్న కుంటను మేం జాగ్రత్తగా చూసుకుంటాం. అయినా నువ్వు ఇలా ఎందుకు చేశావు?’ అని అడుగుతుంటే.. అవేమీ పట్టించుకోకుండా నీళ్లను మరింత మురికి చేశాడు. రైతు కోపంతో తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇతను మళ్లీ చేపలు పట్టడంలో నిమగ్నమయ్యాడు.
పదే పది నిమిషాల్లో ఆ రైతు ఇద్దరు వస్తాదుల్ని తీసుకొచ్చాడు. వారు చూడటానికి ‘ఎముకలు సున్నం’ చేసేవారిలా ఉన్నారు. వెంటనే చేపలు పట్టడం ఆపేసి ఆ రైతు కాళ్లా వేళ్లా పడ్డాడు. ‘నేను చేసింది తప్పే. క్షమాపణలు’ అని చెప్పాడు. క్షణాల్లో ఆ దరిదాపుల్లో లేకుండా కారులో వెళ్లిపోయాడు. ‘ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబితే కానీ అర్థం కాదు’ అన్నాడా రైతు.
Updated Date - May 11 , 2024 | 11:29 PM