జింక్ కూడా ముఖ్యమే
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:03 AM
విటమిన్ డీ, ఐరన్ మొదలైనవి తక్కువ అయితే ఏం జరుగుతుందో చాలా మందికి తెలుసు. కానీ మన శరీరానికి అత్యంత అవసరమైన జింక్ గురించి మాత్రం తెలియదు.
విటమిన్ డీ, ఐరన్ మొదలైనవి తక్కువ అయితే ఏం జరుగుతుందో చాలా మందికి తెలుసు. కానీ మన శరీరానికి అత్యంత అవసరమైన జింక్ గురించి మాత్రం తెలియదు. మన శరీరానికి ప్రతి రోజు కనీసం 8 నుంచి 10 మిల్లీగ్రాముల జింక్ అవసరమవుతుంది. ఒక వేళ జింక్ తక్కువ అయితే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. అప్పుడు శరీరం కొన్ని సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.
తరచూ ఇన్‌ఫెక్షన్లు
జింక్ తగ్గటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల వైరస్, బ్యాక్టీరియాలపై రోగనిరోధక వ్యవస్థ సరైన పోరాటం చేయలేదు. దీనితో తరచు ఇన్‌ఫెక్షన్లు వస్తూ ఉంటాయి.
గాయాలు నెమ్మదిగా
గాయం మానాలంటే కణాల విభజన సక్రమంగా, చురుకుగా జరగాలి. ఈ రెండు ప్రక్రియలలోను జింక్ కీలకపాత్ర పోషిస్తుంది. జింక్ సరిగ్గా లేకపోతే గాయాలు త్వరగా మానవు.
జట్టు ఊడిపోవటం
జింక్ తక్కువ ఉంటే జట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎవరికైనా జుట్టు ఊడిపోతుంటే జింక్ విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి పరీక్షలు చేయించుకోవాలి.
ఆకలి మందగించటం
జింక్ తగ్గటం వల్ల రుచి, వాసన సరిగ్గా తెలియవు. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. ఆకలి వేయకపోతే ఆహారం సరిగ్గా తినరు. దీని వల్ల తగినంత జింక్ లభించదు. ఇదంతా ఒక వలయంగా తయారవుతుంది.
చర్మ సమస్యలు
చర్మ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ సరిగ్గా లేకపోతే రకరకాల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశముంది.
మెదడుపై
మెదడుపై కూడా జింక్ ప్రభావం చూపిస్తుంది. జింక్ సరిగ్గా లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. దీని వల్ల డిప్రషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయి.
Updated Date - Dec 01 , 2024 | 01:03 AM