ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heart Attack: గుండెకు గండం లేకుండా...

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:23 AM

అప్పటివరకూ చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు టక్కున కుప్పకూలిపోయి చనిపోతున్న సందర్భాలను చూసున్నాం.

ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే గుండెపోటుగా భావించి, హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తూ ఉంటాం. అయితే గుండెలో తలెత్తే కొన్ని ఇబ్బందులకు తక్షణ చికిత్స అవసరమవుతుంది. అలాంటిదే.. సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌. హఠాత్తుగా గుండె ఆగిపోయే ఈ అత్యవసర స్థితి, సడెన్‌ కార్డియాక్‌ డెత్‌కు దారి తీయకుండా ఉండకుండా తక్షణమే ఎలా స్పందించాలో, ఆ సమయంలో సిపిఆర్‌ ఎలా కీలకంగా మారుతుందో వైద్యులు వివరిస్తున్నారు.

ప్పటివరకూ చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు టక్కున కుప్పకూలిపోయి చనిపోతున్న సందర్భాలను చూసున్నాం. ఏం జరిగిందో అర్థం చేసుకుని, ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు పోతున్న సందర్భాలు కూడా కోకొల్లలు. ఇలా కుప్పకూలిపోడానికి గుండెపోటు కారణమై ఉంటుందనే అవగాహన మనందరికీ ఉంటోంది. కానీ గుండెపోటుతో పాటు, హఠాత్తుగా గుండె ఆగిపోయే సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గురైనప్పుడు కూడా ఇలాగే కుప్పకూలిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం తాత్సారం చేయకుండా, తక్షణమే సిపిఆర్‌తో గుండె కొట్టుకునేలా చేసి, ఆ తర్వాతే ఆస్పత్రికి తరలించవలసి ఉంటుంది.

సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గుండె జబ్బులు ప్రధాన కారణం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల వల్ల, గుండె కండరం జబ్బు పడడం వల్ల... ఇలా గుండె, సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గురి అవడానికి ఎన్నో కారణాలుంటాయి. గుండెపోటుకు గురైన ప్రతి సందర్భంలో గుండె ఆగిపోయే పరిస్థితి తలెత్తకపోవచ్చు. ఛాతీ నొప్పి, ఆయాసం లాంటి లక్షణాలతో గుండెపోటుకు గురైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకునే సమయం ఉంటుంది. కానీ తీవ్రమైన గుండెపోటుకు గురైన సందర్భాల్లో సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ అనే ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితి అకస్మాత్తుగా తలెత్తుతూ ఉంటుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తున్న సందర్భంలో లేదా పార్కులో నడుస్తున్న సమయంలో.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాల్లోపే గుండెను కొట్టుకునేలా చేయకపోతే, రక్తస్రావం జరగక మెదడు దెబ్బతింటుంది. కాబట్టి తక్షణమే స్పందించాలి. అంబులెన్స్‌ వచ్చేవరకూ, ప్రాణాలు పోకుండా సదరు వ్యక్తిని కాపాడుకోవాలంటే, వెంటనే సిపిఆర్‌ మొదలుపెట్టి గుండె కొట్టుకునేలా చేయాలి.


డెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గురైన వ్యక్తిని బ్రతికించే అవకాశాలు 10 శాతం కంటే తక్కువ. ఈ సమస్యకు గురైన వ్యక్తికి చికిత్సను అందించడం కోసం, అంబులెన్స్‌ వచ్చేవరకూ ఆలస్యం చేయడం ప్రమాదకరం. సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టలు సడెన్‌ కార్డియాక్‌ డెత్స్‌గా పరిణమిస్తున్న సందర్భాలు మన దేశంతో పాటు, అత్యంత వేగంగా అంబులెన్స్‌ సేవలు అందే విదేశాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం తక్షణ సిపిఆర్‌ అందకపోవడమే! కాబట్టి సడెన్‌ కార్డెయాక్‌ అరె్‌స్టను కచ్చితంగా నిర్థారించుకోవడంతో పాటు, సత్వరమే సిపిఆర్‌ మొదలుపెట్టడం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాధారణ కారణాల వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తులో శ్వాస ఆడుతూ ఉంటుంది, నాడి కొట్టుకుంటూ ఉంటుంది. కానీ సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గురైన వాళ్లలో ఈ రెండు లక్షణాలూ ఉండవు. కాబట్టి శ్వాసను నిర్థారించుకోవడం కోసం ముక్కు దగ్గర వేలిని ఉంచి పరీక్షించాలి. నాడిని నిర్థారించుకోవడం కోసం మణికట్టుకు బదులుగా మెడ దగ్గర పరీక్షించాలి.

ఆటొమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌

కార్డియొ పల్మనరీ రిససిటేషన్‌ అనే ఈ ప్రక్రియ గురించి మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటోంది. అరచేతులు కలిపి ఛాతీ దగ్గర నొక్కే ఈ ప్రక్రియతో ఆగిన గుండె కొట్టుకోవడం మొదలుపెట్టే అవకాశాలుంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా సిపిఆర్‌ మొదలుపెట్టాలి. అయితే సిపిఆర్‌ చేయడమెలాగో తెలిసినా, దాన్ని సక్రమంగా చేయడమెలాగో తెలిసి ఉండాలి. అందుకోసం ప్రస్తుతం ఆస్పత్రుల్లో ‘హార్ట్‌ సేవర్స్‌’ పేరుతో సిపిఆర్‌ శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆటొమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌ (ఎఇడి) అనే పరికరం వాడకం కూడా తెలుసుకుని ఉండాలి. ఈ పరికరం హృదయ స్పందన ఆధారంగా గుండె పరిస్థితిని అంచనా వేసి, సక్రమంగా స్పందించేలా ఎలక్ట్రిక్‌ షాక్‌ను విడుదల చేస్తుంది. సడెన్‌ కార్డియాక్‌ అరె్‌స్టకు గురైన వ్యక్తులకు సిపిఆర్‌ అందిస్తూనే, ఎఇడి పరికరాన్ని కూడా ఉపయోగించగలిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు.. ఇలా వీలున్న ప్రతి చోటా ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదాల కోసం ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్స్‌ అందుబాటులో ఉంచుకున్న విధంగానే, ఎఇడి పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోగలిగితే సడెన్‌ కార్డియాక్‌ డెత్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు.


బైస్టాండర్‌ సిపిఆర్‌, పబ్లిక్‌ ఎఇడి ప్రోగ్రాం

సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ ఎప్పుడైనా, ఎవరికైనా జగరవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్‌, ఎఇడిల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం. వీటి పట్ల అవగాహన పెంచడం కోసం నెదర్లాండ్స్‌, డెన్‌మార్క్‌ మొదలైన దేశాల్లో బైస్టాండర్‌ సిపిఆర్‌, పబ్లిక్‌ ఎఇడి ప్రోగ్రాంలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. సిపిఆర్‌ చేయాలంటే ఎవరికైనా ఎంతోకొంత భయం ఉంటుంది. నేను సరిగా చేయగలుగుతానో లేదో, పొరపాటు జరిగితే అవతలి వ్యక్తి ప్రాణాలు పోతాయేమో అనే భయంతో సిపిఆర్‌ చేయడానికి వెనకాడే వాళ్లూ ఉంటారు. ఇలాంటి భయాలను పోగొట్టడం కోసం విదేశాల్లో రక్షణ చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. ఇలా అత్యవసర పరిస్థితిలో సిపిఆర్‌ చేసే వ్యక్తులు, ఎదుటి వ్యక్తికి సహాయపడాలనే సదుద్దేశంతోనే ఆ ప్రయత్నానికి పూనుకుంటారు కాబట్టి, ఒకవేళ ఫలితం ప్రతికూలంగా మారినా, సదరు వ్యక్తులకు విదేశాల్లో చట్టపరమైన రక్షణ దక్కుతూ ఉంటుంది. అరుతే మన దేశంలో ఇలాంటి చట్టాలు లేవు కాబట్టి సిపిఆర్‌ చేసే విధానం గురించి మెరుగైన శిక్షణ తీసుకోవడం అవసరం. శిక్షణ తీసుకుంటే, ఛాతీ మీద చేతులను ఎక్కడ, ఏ విఽధంగా ఉంచి, ఎంత తీవ్రతతో ఒత్తిడిని కలిగించాలి అన్నది తెలుస్తుంది. పలు ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలు సిపిఆర్‌ ట్రైనింగ్‌ కోర్సును అందిస్తున్నాయి. ఎవరైనా ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుని, శిక్షణ తీసుకుని, సర్టిఫికెట్‌ పొందవచ్చు.

ఎఇడి అత్యవసరం

అపార్ట్‌మెంట్లలో, ఇతరత్రా నివాస సముదాయాల్లో ఎఇడిలను అందుబాటులో ఉంచుకోవాలి. 80 వేల నుంచి లక్ష రూపాయల ధర పలికే ఎఇడిలతో అంతకంటే ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్ల మాదిరిగానే ఎఇడిలకు కూడా నివాస సముదాయాల్లో స్థానం కల్పిస్తే, అత్యవసర సందర్భాల్లో ప్రాణ రక్షణకు ఇవి తోడ్పడతాయి. వీటిని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వాటి వాడకం నేర్చుకుని, బ్యాటరీలను సరి చూసుకుంటూ జాగ్రత్తగా నిర్వహించుకుంటూ ఉండాలి.


ఇలా స్పందించాలి

గుండె పోటు లేదా కార్డియాక్‌ అరె్‌స్టతో కుప్పకూలిపోయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్లు రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. కొందరు లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు బలవంతంగా నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్లు ఎలా స్పందించాలంటే...

  • మెడ దగ్గర పల్స్‌, ముక్కు దగ్గర శ్వాసలను పరీక్షించాలి

  • చదునైన ఉపరితలం మీద పడుకోబెట్టి సిపిఆర్‌ మొదలుపెట్టాలి

  • సిపిఆర్‌ చేస్తూనే అంబులెన్స్‌కు కబురు పెట్టాలి

  • అవసరాన్ని బట్టి ఎఇడి ఉపయోగించాలి

  • నీళ్లు తాగించే ప్రయత్నం చేయకూడదు

  • శరీరాన్ని ఎక్కువగా కదిలించకూడదు.

Updated Date - Dec 17 , 2024 | 05:23 AM