గూగుల్ మెసేజెస్‌కు అప్డేట్!
ABN , Publish Date - Feb 03 , 2024 | 05:58 AM
గూగుల్ మెసేజెస్‌కు టెలిగ్రామ్ తరహా ఫీచర్ రానున్నట్టు సమాచారం. దీంతో యూజర్లు చాట్ బబుల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. గూగుల్ మెసేజెస్ వాస్తవానికి రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్‌సీఎస్)ను ఉపయోగిస్తుంది. ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్ ఇటు పంపుకోవడానికి,

గూగుల్ మెసేజెస్‌కు టెలిగ్రామ్ తరహా ఫీచర్ రానున్నట్టు సమాచారం. దీంతో యూజర్లు చాట్ బబుల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. గూగుల్ మెసేజెస్ వాస్తవానికి రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్‌సీఎస్)ను ఉపయోగిస్తుంది. ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్ ఇటు పంపుకోవడానికి, అటు అందుకోవడానికి ఆర్‌సీఎస్‌ను ఉపయోగించుకుంటుంది. అలాగే ప్రస్తుతం సెల్ఫీ జీఐఎఫ్‌లపై పనిచేస్తోందని తెలిసింది. తాజాగా బేటా అప్డేట్‌తో చాట్ బబుల్స్‌ను కస్టమైజ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. థెస్పాండ్రాయిడ్ నివేదిక ప్రకారం టిప్‌స్టర్ ఒకరు ఈ కొత్త అప్డేట్‌ను గుర్తించారు. దీంతో మరొక ప్రయోజనం - చాట్ కలర్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. డిసెంబర్‌లోనే గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే సంబంధిత సమాచారం మాత్రం బైటకు రాలేదు. ఈ క్రమంలోనే వచ్చిన మరొక ఫీచర్ ఫొటోమోజీ. దీంతో తమ ఫేవరైట్ ఫొటోలను స్పందనను వ్యక్తపరిచేవిగా, స్టిక్కర్లుగా మార్చవచ్చు. ఈ ఫీచర్ కోసం గూగుల్ మెసేజెస్‌ను మొదట ఓపెన్ చేయాలి. కంపోజ్ ఫీల్డ్‌ను నేవిగేట్ చేయాలి. అక్కడ ఎమోజీ బటన్‌పై సర్క్యులర్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. అది చాలు ఫొటోమోజీ యాక్టివ్‌గా ఉందని తేలుతుంది.