ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏ విటమిన్‌ ఎందుకోసం?

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:49 PM

ఎటువంటి రోగకారక క్రిముల ప్రమేయం లేకుండా అనారోగ్యానికి గురయ్యామంటే అందుకు ‘విటమిన్‌ డెఫిసియన్సీ’ కారణం. ఈ లోపాన్ని పూరించాలంటే సమతులాహారం తీసుకోవటంతోపాటు విటమిన్ల

ఎటువంటి రోగకారక క్రిముల ప్రమేయం లేకుండా అనారోగ్యానికి గురయ్యామంటే అందుకు ‘విటమిన్‌ డెఫిసియన్సీ’ కారణం. ఈ లోపాన్ని పూరించాలంటే సమతులాహారం తీసుకోవటంతోపాటు విటమిన్ల లోపంతో తలెత్తే రుగ్మతల కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి.

విటమిన్‌ ఎ: ఎదుగుదల, రోగనిరోధక శక్తి, కంటిచూపుకు అవసరం. ఎ విటమిన్‌ లోపంవల్ల ఈ అంశాలకు సంబంధించిన బలహీనతలు తలెత్తుతాయి. మరిముఖ్యంగా కంటిచూపు మందగించటం, రేచీకటిలాంటి సమస్యలు బాధిస్తాయి.

విటమిన్‌ బి1: ఈ విటమిన్‌ డెఫిసియన్సీ వల్ల ‘బెరిబెరి’ రుగ్మత బాధిస్తుంది.

విటమిన్‌ బి5: పారాస్థీసియా అనే సమస్య తలెత్తుతుంది.

విటమిన్‌ బి7: పునరుత్పత్తి, వెంట్రుకలు, చర్మసంబంధ సమస్యలు వేధిస్తాయి.

విటమిన్‌ బి12: అనీమియా బారిన పడే ప్రమాదం ఉంది.

విటమిన్‌ సి: బలహీనత, బరువు తగ్గటం, ఒళ్లు నొప్పులు, స్కర్వీ సమస్యలు వేధిస్తాయి.

విటమిన్‌ డి: రికెట్స్‌, ఎముకల సమస్యలు.

విటమిన్‌ ఇ: నరాల సమస్యలు

విటమిన్‌ కె: రక్తం గడ్డకట్టే సమస్యలు, ఎముకలు గుల్లబారటం.

Updated Date - Sep 01 , 2024 | 11:53 PM

Advertising
Advertising