Nutritional deficiency : సిలీనియం తగ్గితే?
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:08 AM
థైరాయిడ్ హార్మోన్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించే సిలీనియం అనే మూలకం, వేర్వేరు శరీర జీవక్రియల పనితీరుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది.
థైరాయిడ్ హార్మోన్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించే సిలీనియం అనే మూలకం, వేర్వేరు శరీర జీవక్రియల పనితీరుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పోషకం లోపంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అదెలాగో తెలుసుకుందాం!
సిలీనియం కలిగి ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి గుండెకు రక్షణనిచ్చి, మెరుగైన పనితీరుకు దోహదపడతాయి. ఈ మూలకం లోపంతో థైరాయిడ్ గ్రంథి, కండరాలు, గుండె దెబ్బతింటాయి. ప్రత్యేకించి ఈ మూలకం లోపంతో గుండె, కేషన్ వ్యాధి బారిన పడుతుంది. చైనాలోని కేషన్ అనే ప్రాంతం నుంచి ఈ వ్యాధికి ఈ పేరొచ్చింది. అక్కడి నేలల్లో సిలీనియం మోతాదు తక్కువగా ఉండడంతో, ఆ ప్రాంతంలోని ప్రజలు ‘కార్డియొమయోపతి’ని పోలిన గుండె జబ్బు బారిన పడుతూ ఉండడంతో ఈ వ్యాధికి ఆ ప్రాంతం పేరును పెట్టడం జరిగింది. గుండె పెరగడం, గుండె కండరాలు బలహీనపడడం, గండె పనితీరులో హెచ్చుతగ్గులు తలెత్తి అంతిమంగా గుండె విఫలమైపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. ఈ లోపాన్ని అరికట్టడం కోసం పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, బీన్స్, బఠాణీ, పుట్ట గొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఓట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
Updated Date - Nov 19 , 2024 | 01:08 AM