ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty products : ప్రత్యేకించి పిల్లల కోసం

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:27 AM

మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులన్నీ పెద్దల కోసం ఉద్దేశించినవి. అయితే పిల్లల కోసం ఎలాంటి ఉత్పత్తులను ఎంచుకోవాలి? వాటిని ఏ మోతాదులో వాడుకోవాలి?

మేకప్‌

మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులన్నీ పెద్దల కోసం ఉద్దేశించినవి. అయితే పిల్లల కోసం ఎలాంటి ఉత్పత్తులను ఎంచుకోవాలి? వాటిని ఏ మోతాదులో వాడుకోవాలి?

పెళ్లిళ్లు లాంటి వేడుకల్లో పిల్లలను కూడా అందంగా ముస్తాబు చేయాలనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో పెద్దలు ఉపయోగించే సౌందర్య సాధనాలనే పిల్లలకూ ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వాటిలో పిల్లలకు హాని కలిగించేవీ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి.

  • ఇవి వద్దు

  1. కోల్‌, కాజల్‌, సుర్మా, సింథూర్‌లలో భారీ లోహాలు, సీసం ఉంటాయి. కాబట్టి వాటిని పిల్లలకు వాడకూడదు. వీటికి బదులుగా కర్పూరంతో తయారయ్యే కాటుక ఉత్తమం.

  2. నెయిల్‌ పాలి్‌షలో ఉండే ఫార్మాల్‌డిహైడ్‌, టోలీన్‌ లాంటి రసాయనాలు పిల్లలకు హాని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి కొన్ని రసాయనాలను వాడలేదని నిర్థారించే వివరాల కోసం లేబుళ్లను వెతకాలి. ‘5 ఫ్రీ, 7 ఫ్రీ, 9 ఫ్రీ’ లేబుళ్లతో కూడిన నెయిల్‌ పాలిష్‌ ఎంచుకోవాలి.

  3. లిప్‌స్టిక్‌లకు బదులుగా పిల్లలకు లిప్‌గ్లాస్‌ వాడుకోవచ్చు.

  • ఇంట్లోనే ఇలా...

పిల్లలకు ఎటువంటి చర్మ సమస్యలూ రాకుండా ఉండాలంటే సౌందర్య ఉత్పత్తులను ఇంట్లోనే తయారుచేసుకోవాలి.

  1. లిప్‌స్టిక్‌: తాజా కొబ్బరినూనె, బీట్‌రూట్‌ రసాలను కలిపి లిప్‌స్టిక్‌గా వాడుకోవచ్చు. దీన్నే బ్లష్‌గా ఉపయోగించుకోవచ్చు.

  2. మైనం, షియా బటర్‌ లేదా కోకో బటర్‌, కొబ్బరినూనెలకు, అదనపు రసాయనాలు, రంగులూ జోడించని ఆహారపు రంగులు లేదా బీట్‌రూట్‌ పొడిని కలుపుకోవచ్చు. అందుకోసం మైనం, వెన్న, కొబ్బరినూనెను గిన్నెలో వేసి, చిన్న మంట మీద వేడి చేయాలి. కరిగిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దింపి, రంగును కలుపుకోవాలి. చల్లారిన తర్వాత నిల్వ చేసుకోవాలి.

  3. కాజల్‌: సంప్రదాయ పద్థతిలో మసి, కర్పూరాలతో తయారుచేసుకున్న కాటుక సురక్షితమైనది.

  4. ఐ షాడో, ఫేస్‌ పౌడర్‌: బీట్‌రూట్‌ ముక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని, షియా బటర్‌ కలుపుకుని వాడుకోవచ్చు. కోకోపౌడర్‌ కూడా ఐ షాడోగా పనికొస్తుంది.

  5. ఐ లైనర్‌: యాక్టివేటెడ్‌ చార్కోల్‌ ముద్దగా మారే వరకూ, దాన్లో చుక్కలు చుక్కలుగా డిస్టిల్డ్‌ వాటర్‌ కలుపుతూ ఉండాలి. కావలసిన చిక్కదనం వచ్చాక, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Updated Date - Nov 16 , 2024 | 05:30 AM