రాత్రివేళల్లో ఉద్యోగం చేస్తున్నారా?
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:14 AM
రాత్రివేళ వృత్తుల్లో కొనసాగే వారి శరీరాలు ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటాయి.
రాత్రివేళ వృత్తుల్లో కొనసాగే వారి శరీరాలు ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటాయి. విదేశాల సమయవేళలకు తగ్గట్టు రాత్రివేళ మేలుకుని ఉద్యోగాలు చేసే వాళ్లు ముంచుకొచ్చే ఈ ఆరోగ్య ముప్పులను దృష్టిలో పెట్టుకోవాలి.
మెటబాలిజం
ఆహారాన్ని శక్తిగా మలిచే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. శరీర జీవగడియారంలో అవకతవకల వల్ల హార్మోన్ల విడుదల క్రమం తప్పుతుంది. వీటికి తోడు వేళ కాని వేళల్లో ఆహారం తినడం, వ్యాయామం లోపించడం, దురలవాట్లు సమస్యను మరింత క్లిష్టం చేస్తాయి.
నిద్ర సమస్యలు
మన శరీరం వెలుగుకు, సూర్యరశ్మికి స్పందించేలా పరిణామం చెందింది. కానీ రాత్రివేళ మేలుకునే ఉద్యోగాల వల్ల, నిద్రపట్టకపోవడం లేదా నిద్రను కొనసాగించలేకపోవడం అనే రెండు సమస్యలు వేధిస్తాయి.
జీర్ణ సమస్యలు
పొట్టలో అసౌకర్యం, మలబద్ధకం, వాంతులు, విరోచనాలు, ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి.
గుండె జబ్బులు
పగటి ఉద్యోగాలు చేసే వాళ్లతో పోలిస్తే, ఐదు నుంచి ఆరేళ్ల పాటు రాత్రివేళ విధుల్లో కొనసాగేవాళ్లలో గుండె జబ్బులు ఎక్కువ అని పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్
జీవగడియారంలో అవకతవకలు కణపనితీరును ప్రభావితం చేస్తాయి. దాంతో డిఎన్‌ఎ మరమ్మతు, కణ చక్రాలు, కణ మరణాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
ఇలా సరిదిద్దాలి
ఇతర దేశాల సమయాలకు అనుగుణంగా పని చేసే ఉద్యోగులు, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవడం కోసం కొన్ని నియమాలను పాటించాలి. అవేంటంటే...
పగటివేళ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి
నిద్రకు రెండు గంటల ముందు కాఫీ, కెఫిన్ ఆధారిత పానీయాలకు దూరంగా ఉండాలి
ఆహారవేళలను పాటించాలి, వ్యాయామం చేయాలి
వృత్తిలో తీసుకునే అల్పాహారాల్లో భాగంగా మాంసకృత్తులు, పీచు సమృద్ధిగా ఉండే పదార్థాలు తినాలి.
Updated Date - Nov 19 , 2024 | 01:15 AM