Viral: ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ! యూకేలో సత్తా చాటిన భారత సంతతి బాలుడు
ABN, Publish Date - Dec 01 , 2024 | 10:03 PM
బ్రిటన్‌కు చెందిన భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా తెలివితేటల్లో ప్రపంచప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌నే మించిపోయాడు. కేవలం పదేళ్ల వయసులోనే అతడు ఓ ఐక్యూ పరీక్షలో ఏకంగా 162 స్కోరు సాధించి బాల మేధావిగా నిలిచాడు.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా తెలివితేటల్లో ప్రపంచప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌నే మించిపోయాడు. కేవలం పదేళ్ల వయసులోనే అతడు ఓ ఐక్యూ పరీక్షలో ఏకంగా 162 స్కోరు సాధించి బాల మేధావిగా నిలిచాడు. ప్రపంచంలోని టాప్ ఒక శాతం మేధావుల్లో ఒకడిగా గుర్తింపు సాధించాడు. బాలుడి మేధోశక్తి ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి శాస్త్రవేత్తలను దాటిపోవడంతో అతడికి మెన్సా అసోసియేషన్‌లో చోటు దక్కింది. మేధావులకు మాత్రమే ఛాన్సుండే ప్రముఖ క్వీన్స్ ఎలిజబెత్ స్కూల్లో కూడా అడ్మిషన్ లభించింది.
ఇంగ్లండ్‌లోని హన్స్‌లో ప్రాంతంలో ఉంటున్న క్రిష్ బాలమేధావే కాకుండా మంచి కళాకారుడు కూడా. పియానో వాయిద్యంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. 7వ గ్రేడ్ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్నాడు (NRI).
NRI: ఎమిరేట్స్‌లో తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో వనభోజనాలు
క్రిష్ తల్లిదండ్రులు మౌళి నిశ్చల్ ఇద్దరు ఇంజినీర్లే. నాలుగేళ్ల వయసులోనే క్రిష్ సామర్థ్యం తమకు అవగతమైందని వారు తెలిపారు. ‘‘నాలుగేళ్ల వయసులోనే అతడు తన వయసుకు మించిన మేధోసామర్థ్యాన్ని కనబరిచేవాడు. చాలా అనర్గళంగా చదివేవాడు. అతడి రాతల్లో అక్షర దోషాలే ఉండేవి కావు. గణితం అంటే ఎంతో ఇష్టం. ఓ రోజు కేవలం మూడు గంటల్లోనే గణితం పాఠ్య పుస్తకాన్ని మొత్తం నేర్చేసుకున్నాడు. ఆ వయసులోనే డెసిమల్ డివిజన్ కూడా చేయడం ప్రారంభించాడు’’ అని వారు చెప్పారు. ఎనిమిదేళ్ల వయసులోనే అతడు ఆ ఏడాది పూర్తి సిలబస్‌ను ఒక్క రోజులో పూర్తి చేసినట్టు క్రిష తల్లి పేర్కొంది. ఏం చేసినా అందులో ముందుంటాడని వెల్లడించింది.
NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు
చదువులోనే కాకుండా సంగీతంలోనే ప్రావీణ్యం సాధించిన క్రిష్ చాలా చిన్న వయసులోనే అవార్డులు సొంతం చేసుకున్నాడు. కేవలం ఆరు నెలల్లో పియానో వాయిద్య నైపుణ్యాలకు సంబంధించి నాలుగు గ్రేడ్లు పూర్తి చేసుకుని ట్రినిటీ కాలేజ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడికి 7వ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది. పశ్చిమ లండన్‌లో పలు పోటీల్లో పాల్గొని తన కంటే పెద్ద వయసు వారిపై గెలిచాడు. మ్యూజిక్ షీట్ చూడకుండానే సంక్లిష్ట కంపోజిషన్లను గుర్తుచేసుకుని పియానో వాయించగలనని క్రిష్ చెప్పుకొచ్చాడు. ఇక చదువు, పియానో పోను ఖాళీ సమయాల్లో క్రిష్ పజిల్స్, క్రాస్ వర్డ్స్ పరిష్కరించేందుకు ఇష్టపడతాడు. అతడికి యంగ్ షెల్డన్ టీవీ షో అంటే ఎంతో ఇష్టమని తల్లిదండ్రులు చెప్పారు. అతడికి చదరంగం కూడా నేర్పించడం ప్రారంభించారు. చెస్‌లో క్రిష్ తరచూ తన ఇన్‌స్ట్రక్టర్‌పై పైచేయి సాధిస్తుంటాడని కూడా వారు పేర్కొన్నారు. కాగా, తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌ను మించిపోయివడం తనకు పట్టలేని ఆశ్చర్యం కలిగించిందని క్రిష్ పేర్కొన్నాడు.
Updated Date - Dec 01 , 2024 | 10:16 PM