ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భారతీయ బుర్జ్ ఖలీఫా! బెంగళూరులోని ఈ బిల్డింగ్‌పై పేలుతున్న సెటైర్లు!

ABN, Publish Date - Oct 26 , 2024 | 09:29 PM

బెంగళూరులో త్వరలో అక్రమనిర్మాణాల కూల్చి వేత ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఐదు అంతస్తుల అక్రమకట్టడాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది భారతీయ బుర్జ్ ఖలీఫా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం ఇటీవల కూలడంతో ఏకంగా 8 మంది మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన నగరపాలక సంస్థ సిటీలోని అక్రమ నిర్మాణాల లెక్క తేల్చి వాటిని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెండు రోజుల్లో కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. అయితే, అక్రమనిర్మాణాల జాబితాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనం తాలూకు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కలకలం రేపుతున్నాయి. నగర పాలక సంస్థ తొలుత ఈ భవనాన్ని టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక మీడియా చెబుతుంటే జనాలు మాత్రం ఈ భవనాన్ని చూసి షాకైపోతున్నారు. ఇది భారతీయ బుర్జ్ ఖలీఫా అంటూ కామెంట్స్ వరద పారిస్తున్నారు (Viral).

Viral: ఊహించని రీతిలో చిరుత సాహసం! ప్రాణాలకు తెగించి మరీ.. షాకింగ్ వీడియో


కేవలం 10 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉన్న స్థలంలో ఏకంగా ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. హెన్నూర్‌లోని నంజప్ప గార్డెన్ ప్రాంతంలో ఈ భవనం ఉంది. ఇది అక్రమ కట్టడమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భవనం ఫొటోలు నెట్టింట పెట్టగానే వైరల్‌గా మారాయి. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. భవనం ప్లాన్ డిజైన్ చేసిన ఇంజినీర్‌ను, స్థలం ఓనర్‌ను జనాలు తిట్టిపోస్తున్నారు. ఇంత చిన్న స్థలంలో 5 అంతస్తుల భవనం ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల దురాశకు హద్దు లేదని విమర్శిస్తున్నారు. మరి కొందరు మాత్రం బిల్డింగ్‌ను డిజైన్ చేసిన ఇంజినీర్‌ను మెచ్చుకుంటున్నారు. ‘‘ఇది బుర్జ్ ఖలీఫా భవనానికి తాత లాగా ఉంది. దీన్ని కూల్చే బదులు, భవిష్యత్‌ తరాలకు చూపించేందుకు జాగ్రత్తగా కాపాడాలి’’ అని ఓ వ్యక్తి సెటైర్ పేల్చారు.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ అక్రమ భవనాన్ని కూల్చేందుకు యజమాని అంగీకరించారట. దీంతో, కూల్చేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే భవనం చుట్టుపక్కల ఉన్న పలువురిని ఖాళీ చేయించారు. భవనం విద్యుత్ కనెక్షన్ తొలగించాలని కూడా నగర పాలక సంస్థ ఆదేశించింది. ఒక్క రాత్రిలో భవనాన్ని కూల్చేస్తామని, ఆ వ్యర్థాలను మాత్రం ఓనర్ తన సొంత ఖర్చులతో తొలగిస్తాడని అధికారులు చెబుతున్నారు.

Oxford University: బ్రిటన్‌‌లో ఎన్నారై మహిళకు షాక్! పీహెచ్‌డీ కోసం రూ.కోటి ఖర్చు పెడితే..

Viral: వంట చేయలేనని కాబోయే వాడితో అన్న యువతి! చివరకు జరిగిందేంటో తెలిస్తే..

Read Latest and Travel News

Updated Date - Oct 26 , 2024 | 09:37 PM