NRI: గల్ఫ్ రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికుల మృతి
ABN, Publish Date - Dec 16 , 2024 | 08:46 PM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నెలసరి కిరాణా సామాన్లు కొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నెలసరి కిరాణా సామాన్లు కొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు తెలంగాణ ప్రవాసీయులు అని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన షేర్ ఎర్రన్న అనే ప్రవాసీతో పాటు మరోక తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లుగా తెలిసింది. మరో అయిదుగురు వివిధ జిల్లాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు గాయపడినట్లుగా తెలుస్తోంది (NRI).
NRI: సేవా ఇంటర్నేషనల్ అట్లాంటా చాప్టర్ వార్షిక గాలా ఈవెంట్ విజయవంతం!
మృతులు, క్షత్రగాత్రులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. వారాంతపు సెలువు దినమైన ఆదివారం రాత్రి అజ్మాన్, ఖోర్ ఫఖ్ఖాన్ మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిలవడంతో డ్రైవర్ అదుపు తప్పి ప్రమాదం జరినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. మృతులందరు ఆజ్మాన్‌లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. నెలకు ఒక సారి వీరు ఎడారి క్యాంపు నుండి నగరానికి వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తారు.
NRI: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఎన్నారైల ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
దుబాయిలోని భారతీయ కాన్సులేటు గానీ షార్జా పోలీసులు గానీ మృతులు, క్షత్రగాత్రులకు సంబంధించి పేర్లు, వివరాలు వెల్లడించలేదు. సామాజిక మాధ్యమాలలో ప్రమాదానికి సంబంధించి అసత్య సమాచారాన్ని విశ్వసించవద్దని పోలీసులు సూచించారు.
Updated Date - Dec 16 , 2024 | 08:46 PM