ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: బే ఏరియాలో ఏఐఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి ధమాకా వేడుకలు!

ABN, Publish Date - Oct 24 , 2024 | 10:04 PM

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా (డీడీడీ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఎన్నారై డెస్క్: అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా (డీడీడీ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ), బాలీ 92.3 సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని ప్లెసెంటన్‌లో ఉన్న అలమెడా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ ఫ్లాగ్ షిప్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తర అమెరికాలోని 45కు పైగా భారతీయ సంస్థలు ఈ ప్రత్యేకమైన, అతి పెద్ద గ్రాండ్ దివాళీ ఈవెంట్ నిర్వహణకు మద్దతుగా నిలిచాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న ఈ ఈవెంట్ ఆహూతులను ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడిపేందుకు వేలాది కుటుంబాలు తరలివచ్చాయి (NRI).

NRI: రతన్ టాటాకు తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఘన నివాళులు!


ఇలా వివిధ సమయాల్లో వస్తూ పోతూ ఉన్న ఎన్నారైలతో ఫెయిర్ గ్రౌండ్ రోజంతా జనంతో కిక్కిరిసింది. సమీపంలోని పార్కింగ్ లాట్‌లు, రోడ్లు ఎన్నారైల సందడితో జనసంద్రమయ్యాయి. 25 అడుగుల ఎత్తైన అయోధ్య రామాలయం నమూనాతోపాటు రావణ దహనం, టపాసులు కాల్చే వేడుకను చూసేందుకు వారంతా తండోపతండాలుగా తరలివచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్యం వంటి వాటిపై ఈ కార్యక్రమాన్ని రూపొందించారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సీపీఏ (బాణాసంచా), డాక్టర్ ప్రకాష్ అద్వానీ (రావన్ దహన్), ఇతర స్పాన్సర్‌లుగా రిలేటర్ నాగరాజ్ అన్నయ్య, లుర్నిగో(ఎడ్యుకేషనల్ పార్ట్‌నర్), ట్రావెల్ పోడ్, జీ5 (ఎక్స్ క్లూజివ్ స్ట్రీమింగ్ పార్ట్ నర్), OnShore Kare, Kardia (Alivecor inc), తాజ్ మహల్ రెస్టారెంట్, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, ఫ్రెష్ మీట్ ఫ్యాక్టరీ, Realm renovations, తనిష్క్ యూఎస్ఏ, Bhanu Mangoes & Theais’s Jewelers & Desi favors. మీడియా పార్ట్నర్‌గా 'నమస్తే ఆంధ్ర' వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఎన్నారై ప్రముఖులు, వివిధ హోదాలలో ఉన్న అధికారులు, ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని నిర్వాహకులను వారు ప్రశంసించారు. అక్కడకు వచ్చిన వేలాది మంది ఆహూతులకు వారంతా తమ దసరా/ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

NRI: వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు


ఆలమీడా కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హౌబెర్ట్ (కో-హోస్ట్), భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, సిటీ ఆఫ్ ప్లెసెంటన్ మేయర్ కార్లా బ్రౌన్, అసెంబ్లీ సభ్యులు లిజ్ ఓర్టెగా, అలెక్స్ లీ, ఆలమీడా కౌంటీ సూపర్‌వైజర్లు ఎలిసా మార్క్వెజ్, లీనా టామ్... మేయర్ కార్మెన్ మోంటానో (మిల్పిటాస్), అసెంబ్లీ సభ్యులు మియా బోంటా, అలెక్స్ లీ, ఓర్టెగా, లివ్ మోర్ మేయర్ జాన్ మర్చండ్, సిటీ ఆఫ్ ఫెర్మోంట్ మేయర్ లిల్లీ మీయ్, సిటీ ఆఫ్ డబ్లిన్ మేయర్ మైఖేల్ మెక్ కోరిస్టన్, కౌన్సిల్ సభ్యులు రాజ్ సల్వాన్, శ్రీదర్ వెరోస్, కెప్టెన్ రాయ్ గామెజ్ (ప్లెసెంటన్ పోలీస్ డిపార్ట్ మెంట్) తదితరులు అక్కడకు వచ్చిన వారికి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కాంగ్రెస్ మ్యాన్ నుంచి డిస్ట్రిక్ట్ స్టాఫ్ అయిన రో ఖన్నా, ఎరిక్ స్వాల్ వెల్, రెబెక్కా బ్యూర్ కహాన్‌లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

NRI: 24వ తానా మహాసభలు! ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ సక్సెస్‌!


ఈ ఈవెంట్ ముఖ్యాంశాలు: అయోధ్య రామ మందిర నమూనా(25 అడుగులు) చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత ఉత్తర అమెరికాలోనే అతి పెద్ద రావణుడి బొమ్మ (40+ అడుగులు) దహనం చేసే కార్యక్రమం జరిగింది. ఆహూతుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చారు. ఇక, ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష్మీ దేవికి మహా మంగళహారతితో పాటు పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది మంది ఎన్నారైలు రథయాత్రలో రథం లాగారు. గ్రౌండ్ కనుచూపు మేర వరకు పొడవైన క్యూ ఈ రథ యాత్ర సందర్భంగా ఏర్పడింది. బాణసంచా తర్వాత జరిగిన డిస్కో దాండియాలో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని దాండియా ఆడారు.

ప్రముఖ గాయనీగాయకులతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఆహూతులను అలరించింది. దుస్తులు, నగలు, గృహాలంకరణ వస్తువులు, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్ బూత్స్ వంటి షాపింగ్ స్టాల్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగోలీ పోటీలు, క్యారమ్స్, ఛెస్ పోటీలు, కార్నివాల్ గేమ్స్ లో వందలాది మంది ఎన్నారైలు ఆసక్తిగా పాల్గొన్నారు. స్థానిక రెస్టారెంట్లు ‘గ్రేట్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్’ ఏర్పాటు చేసి వండి వార్చిన రుచికరమైన, భిన్నమైన వంటకాలను ఆహూతులు ఆస్వాదించారు. కిడ్స్ ప్లే ఏరియాలో ఏర్పాటు చేసిన గేమ్స్ పిల్లలు ఆస్వాదించారు. రామ్ లీలా కార్యక్రమంలో పెద్దవాళ్లు తమ కుటుబం సభ్యులతో లీనమైపోయారు.


ఈ ఈవెంట్ ఘన విజయం సాధించడంపై ఏఐఏ బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఈవెంట్‌కు ఎన్నారైల నుంచి వచ్చిన స్పందనపై సంతోషం వ్యక్తం చేసింది. 45కు పైగా భారతీయ కమ్యూనిటీ సంస్థలకు చెందిన సభ్యులు చాలా కష్టపడి పనిచేసి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేశారని కొనియాడింది. నార్త్ అమెరికాలోని అతిపెద్ద ఈవెంట్‌లలో ఇది ఒకటని తెలిపింది. తమకు నిరంతరం మద్దతు తెలుపుతున్న స్పాన్సర్‌లందరికీ ఏఐఏ బృందం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో వాలంటీర్లతోపాటు మిడిల్, హైస్కూల్ విద్యార్థులు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపింది.

Read Latest and NRI News

Updated Date - Oct 24 , 2024 | 10:07 PM