ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Akkineni Centenary Celebrations: డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:27 AM

అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.

Akkineni centenary celebrations in Dallas

డాలస్, టెక్సస్: డల్లాస్‌లో పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageshwar Rao) శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20వ తేదీన సాయంత్రం డల్లాస్ పొరుగన గల అల్లెన్ నగరంలో ఉన్న రాధాకృష్ణ ఆలయ ఆడిటోరియంలో వేడుకలు జరగనున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు సినిమాల నుంచి కొన్ని పాటలను ఎంపిక చేసి “అక్కినేని చిత్ర గీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వేడుకల్లో అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానించారు.

NRI: సౌదీలో తెలుగు ఆత్మీయ సమ్మేళనం కోసం జోరందుకున్న ఏర్పాట్లు!


అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) ఆధ్వర్యంలో డా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి (సెప్టెంబర్ 20, 1924 – సెప్టెంబర్ 20, 2024) సందర్భంగా “నటసామ్రాట్ అక్కినేని నటనాజీవితం - వివిధ కోణాల్లో” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఆదివారం డాలస్‌లో ఘనంగా జరిగింది.


అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అక్కినేనితో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధం, ఆయన జీవన ప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావుతో సన్నిహిత సంబంధం ఉన్న ఎఎఫ్‌ఏ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు... అక్కినేని అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు. అక్కినేని జ్ఞాపకశక్తి, ఆత్మీయ పలకరింపులను ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. డా. అక్కినేని నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో, వ్యక్తిత్వం అంత విశిష్టమైందన్నారు. అక్కినేని నాగేశ్వర రావు జీవితం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలిపారు.


అక్కినేని నటనా జీవితంపై చక్కటి విశ్లేషణ

అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ గీత రచయిత, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, – “అక్కినేనితో ముచ్చట్లు”; ప్రముఖ సినీ దర్శకులు, రచయిత, నిర్మాత డా. వి.ఎన్ ఆదిత్య, – “జానపద కథానాయకుడు అక్కినేని”; ‘సినీ విజ్ఞాన విశారద’, సినీ చరిత్రకారుడు ఎస్వీ రామారావు– “అక్కినేని జైత్రయాత్ర”; ప్రముఖ సినీకథా రచయిత్రి, నందిపురస్కార గ్రహీత బలభద్రపాత్రుని రమణి, – “నవలా నాయకుడు అక్కినేని”; ప్రముఖ సినీ నటులు, అక్కినేనికి అత్యంత ఆప్తులు కాదంబరి కిరణ్ – “చిన్నతెరమీద మహానటుడు”; పూర్వ ఆకాశవాణి వార్తల చదువరి, దూరదర్శన్ వ్యాఖ్యాత పోణంగి బాలభాస్కర్ – “భక్తిరస పాత్రల్లో అక్కినేని”; సాహిత్య పరిశోధకులు పారా అశోక్ కుమార్ –“అక్కినేని హేతువాద దృక్పథం”; ‘అక్కినేని వీరాభిమాని’ లక్ష్మీ భవాని – “సాంఘిక చిత్రాలలో మరపురాని కథానాయకుడు” అంటూ వివిధ కోణాల్లో అక్కినేని నటనా జీవితాన్ని చక్కగా విశ్లేషించారు. ప్రముఖ ద్వ్యనుకరణ కళాకారుడు భవిరి రవి అక్కినేని ఎలా మాట్లాడతారో అనుకరించి అలరించారు.

NRI: దేశంలో మొదటిసారిగా గల్ఫ్ మృతులకు పరిహారం!


శతజయంతి వేడుకలకు ఆహ్వానం..

అక్కినేని నాగేశ్వరరావు జన్మదినమైన సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో అక్కినేని సినిమాల నుంచి కొన్ని పాటలను ఎంపిక చేసి “అక్కినేని చిత్రగీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ ఒక ప్రత్యేక నివాళిగా అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.


ఇవి కూడా చదవండి...

NRI: వరద బాధితుల సహాయార్థం ఎన్నారై టీడీపీ యూఎస్ఏ విరాళం

Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’

Read Latest NRI News And Telugu News

Updated Date - Sep 19 , 2024 | 06:40 PM

Advertising
Advertising