ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:29 PM

ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.

  • ఉయ్యాలలు ఏర్పాటుచేసి వాయినాలు, గోరింటాకు పంపిణీ

  • ఉత్సాహంగా పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు

  • అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు

ఎన్నారై డెస్క్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వాధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు (NRI) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వాసులు బతుకమ్మ పండగను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు అట్లతద్దెను అదేస్థాయిలో నిర్వహించారు. ముగ్గులు, ఆటలపోటీలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచివారికి బహుమతులు అందజేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఉమాగౌరీ వ్రతం వేడుకగా చేశారు. పెద్దఎత్తన సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.


NRI: 24వ తానా మహాసభలు! ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ సక్సెస్‌!

ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కాలక్రమేణ అట్లతద్దె కనుమరుగు అవుతోంది. ఆనాటి పండుగలు, వేడుకల పట్ల శ్రద్ధ చూపడం లేదు. ఆ పండుగలు అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఉన్న పిల్లలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని అన్నారు.

NRI: పెనమలూరులో తానా ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం


సుధ కొండపు మాట్లాడుతూ.. ‘‘ఈ పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఉయ్యాల ఏర్పాటుచేసి వాయినాలు పంపిణీ చేశామని తెలిపారు. ఉత్సాహంగా మెహందీ కార్యక్రమంలో పాల్గొని గోరింటాకు పెట్టుకున్నారు’’ అని తెలిపారు.

సాంస్కృతి కార్యక్రమాలను నవ్య ఆలపాటి, సుష్మ అమృతలూరి సమన్వయపరిచారు. ఈ వేడుకలకు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనిత మన్నవ, తనూజ యలమంచిలి, శ్రీదివ్య సోమ, గీత చిలకపాటి, ఇందు చలసాని, శిరీష నర్రా, అపర్ణ ఆలపాటి, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, ఫణి గాయత్రి, సరిత ముల్పూరి, మల్లి నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Oct 22 , 2024 | 08:30 PM