ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు!

ABN, Publish Date - Oct 13 , 2024 | 03:46 PM

యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ.. అంటూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మ ప్రతీక అయిన గౌరమ్మను గౌరవించడానికి మాతృభూమిలోని గడి చావిడి కానీ గల్ఫ్ గానీ అడ్డంకి కాదన్నారు అబుదాబిలోని తెలంగాణ ఆడపడుచులు (NRI).

యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణలోని గ్రామీణ వాతావరణం కంటే మిన్నగా జరిగిన బతుకమ్మ వేడుకలలో తంగేడు, గునుగు, గుమ్మడి మొదలగు పువ్వులను సుమారు 3 క్వింటాళ్ళ వరకు తెలంగాణ నుండి ప్రత్యేకంగా తెప్పించినట్లుగా కార్యక్రమ నిర్వహణలో ముఖ్య భూమిక పోషించిన తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా, తెలంగాణ పిండి వంటలు ప్రత్యేకించి సకినాళ్ళ తయారీకి పేరొందిన వరంగల్‌లోని శ్రీ నిధి తెలంగాణ పిండి వంటల నుండి ప్రత్యేకంగా తెప్పించిన తెలంగాణ పిండి వంట పదార్థాలను సభికులకు పంపిణీ చేయడంతో ఉత్సాహం రెట్టింపయ్యింది.

NRI: డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ‘గాంధీ శాంతి నడక – 2024’


ప్రప్రథమంగా తాను గల్ఫ్‌లో బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం మరువలేని అనుభూతి అని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ నర్సింహులు వ్యాఖ్యానించారు.

తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా డప్పు వాయిద్యం, కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను పేరుస్తూ వందలాది మహిళలు బతుకమ్మ పాటలతో మార్మోగించగా, భారతదేశం నుండి వచ్చిన ప్రముఖ కవి గాయకుడు అష్ట గంగాధర్, గాయని తేజు ప్రియా ఆలపించిన జానపద గేయాలు కనువిందు చేశాయి.

వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ దౌత్యవేత్త అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిథిగా సతీసమేతంగా పాల్గొనగా ఆయన సతీమణి కూడా బతుకమ్మ ఆడారు. అదే విధంగా గౌరవ అతిథిగా పాల్గొన్న కాన్సులర్ డాక్టర్ ఆర్. బాలాజీ సతీమణి కూడా బతుకమ్మ ఆడి పాడారు. తదనంతరం కార్యనిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు, జంటలకు బహుమతి ప్రదానం చేశారు.

NRI: పోటాపోటీగా సాగిన తానా పికిల్ బాల్ టోర్నమెంట్


ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్‌గా సంపంగి గ్రూప్, కోస్పాన్సర్‌గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ కుటుంబ సభ్యులు కూడా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలనులో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు. ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్, వంశీ, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, నిధి తదితరులు దగ్గరుండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్యనిర్వాహకులు రాజశ్రీనివాస రావు తెలియజేశారు.

Read Latest and NRI News

Updated Date - Oct 13 , 2024 | 03:48 PM