ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: దుబాయిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు.. అతిథులుగా బీజేపీ నాయకులు

ABN, Publish Date - Oct 08 , 2024 | 01:35 PM

దుబాయిలో భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రవాసీ సంఘమైన ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ శాఖ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రవాసీ (NRI) సంఘమైన ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ శాఖ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

భారతదేశంతో పాటు వివిధ ఎమిరేట్ల నుండి తెప్పించిన వివిధ రకాల పూలతో సంప్రదాయరీతిలో మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. నిర్వహకులు ఆశించిన దాని కంటే రెట్టింపుగా సభికులు రావడంతో ఒక దశలో గేట్లు మూసివేయవల్సిన పరిస్థితి వచ్చింది. కాలు నొప్పితో విశ్రాంతి తీసుకోవల్సిందిగా వైద్యులు చేసిన సూచనను కాదని పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలపై ఘాటుగా స్పందించే పార్టీకి చెందిన ఆర్మూర్ శాసన సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ ఇద్దరు నాయకులు చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకొన్నాయి.

NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!


ఈ అరబ్బు దేశంలో ఆలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతి సాధించి భారతీయుల మనోభావాలకు ఉన్నత స్థానం కల్పించడం ద్వార ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోకెల్లా మెరుగయిన దౌత్యవేత్తగా రుజువు చేసారని అరవింద్ వ్యాఖ్యానించారు. విశ్రాంతి తీసుకోవల్సిందిగా వైద్యులు చేసిన సూచనను కూడ కాదని తాను ప్రవాసీయుల మీద ఉన్న అభిమానంతో దుబాయికు వచ్చానని ఎంపీ చెప్పారు.

తాను ఒకప్పుడు ఈ దేశంలో కార్మికుడినని, కానీ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. అక్కడి వారు కూడా ఉన్నతంగా ఎదిగాలని రాకేశ్ రెడ్డి ఉద్భోదించారు. దుబాయిలో కాకుండా సొంత జిల్లాలో బతుకమ్మ చేసుకొన్నట్లుగా ఉందని ఆయన చెప్పారు. ప్రవాసీయుల సంక్షేమానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవరావడంలో తాను మొదటి వరుసలో ఉంటానని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.

NRI: ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!


వరుసగా గత మూడు సంవత్సరాల నుండి దుబాయి ఐపీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక మంది మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా భారతీయ సాంస్కృతిక పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ఆడపడుచుల ఆత్మ ప్రతీక అయిన బతుకమ్మను తాము నిర్వహిస్తున్నట్లుగా సంస్థ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు జితేంద్ర వైద్య, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దీపిక, కోర్ కమిటీ సభ్యులు అపర్ణ, డాక్టర్ సౌజన్య, మదన్ మోహన్, నవనీత్ గాజా,వంశీ గౌడ్,అశోక్ పెనుకుల ,అజయ్, జగదీష్, గోవర్ధన్ ,కృష్ణమేగి ,రాజు అడ్లగట్ట ,కృష్ణ నిమ్మల, వేణుగోపాల్ రెడ్డి, రేండ్ల శ్రీనివాస్ డొక్కా శ్రీనివాస్, యోగేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రావణి, ఆమె బృందం కలిసి చేసిన కొలాటాల ప్రదర్శన, తన్మయి నేతృత్వంలో జరిగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బిక్షపతి బృందం వాయించిన దాలేరే దప్పులు సభికులను ఆకర్షించాయి.

Read Latest and NRI News

Updated Date - Oct 08 , 2024 | 01:37 PM