ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: సౌదీ అరేబియాలో 45 ఏళ్ళుగా తెలుగులో సేవలందిస్తున్న చర్చి

ABN, Publish Date - Dec 10 , 2024 | 09:55 PM

ప్రవాసంలో అరబ్బు ఎడారి భిన్న సంస్కృతిలో మాతృభాష తెలుగులో యేసు సువార్తను నాలుగు దశాబ్దలుగా క్రమంగా తప్పకుండా విశ్వాసులకు అందిస్తున్న ఒక తెలుగు చర్చి గురించి ఆసక్తికరమైన కథనం ఇది

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సమాచారం అందునా జ్ఞానం మాతృభాషలో వింటే నేరుగా మనస్సును తాకుతుంది. అందునా దైవజ్ఞానం, దేవుడి సువార్త, స్తోత్రం అయితే నరాల్లో జీర్ణించుకుపోతుంది. ఇక ప్రవాసంలో అరబ్బు ఎడారి భిన్న సంస్కృతిలో మాతృభాష తెలుగులో యేసు సువార్తను నాలుగు దశాబ్దలుగా క్రమంగా తప్పకుండా విశ్వాసులకు అందిస్తున్న ఒక తెలుగు చర్చి గురించి ఆసక్తికరమైన కథనం ఇది (NRI).

NRI: బాలభారతి పాఠశాల విద్యార్థులకు రూ. 10 లక్షల విరాళం!


దేవాది దేవుని స్తోత్రం అంటూ యేసు సువార్తను తెలుగులో అందించడానికి 1712 నుండి జరిగిన ప్రయత్నాలకు జీవ సాక్ష్యం ఈ రోజు గల్ఫ్ దేశాలలో ఉన్న అనేక తెలుగు చర్చిల సేవలు. తెలుగులో బైబిల్ అనువాద ప్రయత్నాలు 1712 నుండి మొదలయినా 1818 వరకు దాన్ని ముద్రించిన తర్వాతే క్షేత్రస్థాయిలో తెలుగువారికి అందుబాటులోకి వచ్చింది. ఈ రకంగా ఏ డోర్నకల్ లేదా అదోని లేదా విశాఖపట్టణమే కాదు పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చే తెలుగు వారి కోసమూ తెలుగులో చర్చి సేవలు మొదలయ్యాయి.

ఇతర ప్రాంతాలతో పోల్చితే సౌదీ అరేబియాలో చమురు ఉత్పదానకు కేంద్రబిందువు అయిన ఈశాన్య ప్రాంతంలో తెలుగు వారి ఉపాధి వలసలు ఎక్కువ. పెద్ద సంఖ్యలో వస్తున్న తెలుగు క్రైస్తవుల కోసం గత 45 సంవత్సరాలుగా అల్ ఖోబర్‌లో తెలుగు ఫెలోషిప్ పేర తెలుగు చర్చి అధ్యాత్మిక అవసరాలను తీరుస్తోంది. ఒక అరబ్బు దేశంలో అందునా సౌదీ అరేబియాలో 45 సంవత్సరాలుగా తెలుగు భాషలో చర్చి భక్తులకు సేవలందిస్తుందంటే అతియోశక్తి కాదు.. ప్రభు కృపా అని క్రైస్తవుల విశ్వాసం.

NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ


1980లో గుంటూరు నగరానికి చెందిన డోలా రాజశేఖర్, అనంతరావు, రూబెన్, రావు, అనంతరావులు భక్త్ సింగ్ సౌజన్యంతో తోఖ్బా ఫెలోషిప్ పేర చర్చి సేవలను ప్రారంభించగా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల అనంతరం జోనథన్, బోజ్, జాన్ భూషణం, సోలమాన్‌లు కూడా వీరికి తోడయ్యారు. కాలక్రమేణా తన సేవలను విస్తరిస్తూ చర్చి భక్తులకు చేరువయింది. రాజశేఖర్ ఆ తర్వాత సమీప ప్రాంతాలతో పాటు రియాధ్ నగరంలో కూడా తెలుగు చర్చిని నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో వీరిలో అత్యధికులు వీసాలను రద్దు చేసుకొని స్వదేశానికి తిరిగి వెళ్ళిపోగా డోలా రాజశేఖర్ కొడుకు డోలా జయకుమార్ సౌదీ అరేబియాకు ఉపాధి నిమిత్తం వచ్చి తన ఉద్యోగంతో పాటు తండ్రి రాజశేఖర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ తోఖ్బా చర్చి నిర్వహణలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. జయకుమార్‌తో పాటు జాన్ పాల్ కూడా ఈ చర్చి నిర్వహణలో ముఖ్య భూమిక వహిస్తున్నారు.

ఎలాంటి ఆర్భాటాలు, ప్రచారం లేకుండా కేవలం దైవ సన్నిధి, సువార్త లక్ష్యంగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో గత 45 ఏళ్ళుగా సేవలందిస్తున్న తోఖ్భా తెలుగు చర్చిలో స్టెఫెన్ పాల్, పవన్ కుమార్, దివాకర్, విల్సన్, రాజకిషోర్ లు భక్తులకు సేవలందిస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే, సౌదీలో తెలుగు చర్చి వ్యవస్థాపకులయిన రాజశేఖర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక కుమారుడు తోఖ్బా తెలుగు చర్చి నిర్వహణలో క్రీయాశీలక పాత్ర వహిస్తుండగా మరో కుమారుడు కిషోర్ రియాధ్ నగరంలో కూడా సువార్తను విశ్వాసులకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest and NRI News

Updated Date - Dec 10 , 2024 | 09:55 PM