NRI: దుబాయిలో క్రెడిట్ కార్డు బాధితుడికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు
ABN, Publish Date - Apr 14 , 2024 | 06:21 PM
దుబాయిలో క్రెడిట్ కార్డు కుంభకోణంలో మోసగాళ్ళ వలలో ఇరుక్కుపోయిన ఓ ప్రవాసీ యువకుడు.. అక్కడి కాంగ్రెస్ ప్రవాసీ విభాగం నాయకుడి చేయూతతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో క్రెడిట్ కార్డు కుంభకోణంలో మోసగాళ్ళ వలలో ఇరుక్కుపోయిన ఓ ప్రవాసీ (NRI) యువకుడు.. అక్కడి కాంగ్రెస్ ప్రవాసీ విభాగం నాయకుడి చేయూతతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన షోయెబ్ ఖాన్ అనే యువకుడిని హైదరాబాద్‌కు చెందిన కొందరు దుబాయికి తీసుకువచ్చి అతని పేర క్రెడిట్ కార్డులు తీసుకొన్నారు. ఎలాంటి వేతనం అందక ఉండడానికి గది కూడా లేదు. ఇతని పాస్ పోర్టును కూడా యజమాని తీసేసుకున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక, దుబాయిలో ఉండలేక నరకయాతన పడుతున్న నేపథ్యంలో అతని తండ్రి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆసుపత్రిలో చేరిన తండ్రిని కడసారి పరామర్శించాలనుకొన్నా వీలు కాలేదు.
NRI: సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి
షోయెబ్ ఖాన్ దయనీయ స్ధితిపై స్పందించిన దుబాయిలోని కాంగ్రెస్ నాయకుడు యస్.వి.రెడ్డి.. అతని కేసును పోలీసులు, సంబంధింత ప్రభుత్వ శాఖలతో పాటు దుబాయిలోని భారతీయ కాన్సులేటు దృష్టికి తీసుకెళ్ళారు. కార్మిక న్యాయస్థానంలో కేసును దాఖలు చేసి నెలన్నర రోజుల పాటు ప్రయత్నాలు చేసి అతణ్ణి స్వదేశానికి పంపించారు.
హైదరాబాద్‌కు వెళ్ళడానికి విమాన టిక్కెట్ సమకూర్చడంతో పాటు అన్ని రకాలుగా షోయెబ్ ఖాన్‌కు ఎస్‌వీ రెడ్డి అండగా నిలిచిన తీరును షోయెబ్ ఖాన్ తల్లి ప్రశంసించారు. భర్త కొల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తనకు కొడుకును దుబాయిలో కష్టాల కడలి నుండి కాపాడినందుకు ఎస్‌వీ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా సందేశం పంపారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 14 , 2024 | 06:22 PM