ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా సుబ్బా యంత్ర

ABN, Publish Date - Oct 10 , 2024 | 06:51 AM

తానా బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ సుబ్బా యంత్ర నియమితులయ్యారు. తానా కమ్యూనిటీకి సేవలందించేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్కొంది

ఎన్నారై డెస్క్: తానా (TANA) బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ సుబ్బా యంత్ర నియమితులయ్యారు. తానా కమ్యూనిటీకి సేవలందించేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్కొంది (NRI).

NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!


డాక్టర్ సుబ్బా యంత్ర ఎంబీఎలో పీహెచ్‌డీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో జాస్పర్ టెక్నాలజీస్‌ను స్థాపించి ప్రస్తుతం ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న మోహన్ స్పిన్ టెక్స్‌కు ప్రమోటర్ డైరెక్టర్, గ్లోబల్ సేల్స్ ‌హెడ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. వ్యాపార రంగంలో 25 సంవత్సరాల విశేష అనుభవం ఆయనకుంది. పాతికేళ్లుగా ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా కొససాగుతున్నారు. రిటైల్, టెక్స్‌టైల్, ఐటీ రంగాలలో పలు కంపెనీలు స్థాపించి వాటిని విజయవంతంగా నడుపుతున్నారు. వ్యాపార రంగంలో విశేషమైన పరిచయాలుండటం, వ్యాపారులతో, ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం సుబ్బా యంత్ర విశిష్టత.

TANA: తానా వైద్యశిబిరం విజయవంతం.. 550 మందికి చికిత్స


ఇండియాతో పాటు అమెరికాలోని బే ఏరియాలో పలువురు ఎంబీఏ విద్యార్థులకు ఆయన అడ్జసెంట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో (మార్కెటింగ్) ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ సాధించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో భార్య, ఇద్దరు కుమారులతో ఆయన నివసిస్తున్నారు. తనను తానా బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించిన సందర్భంగా జయరాం కోమటి, వెంకట్ అడుసుమల్లిలకు, బే ఏరియాలోని తానా నాయకులు సుబ్బా యంత్ర కృతజ్ఞతలు తెలిపారు.

NRI: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే చంద్రబాబు ధ్యేయం: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest and NRI News

Updated Date - Oct 10 , 2024 | 06:53 AM