Dubai: భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే జారీ!
ABN, Publish Date - Feb 25 , 2024 | 05:18 PM
భారత్‌తో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ ఇటీవలే మల్టీ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.
ఎన్నారై డెస్క్: భారత్‌తో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ (Dubai) ఇటీవలే మల్టీ ఎంట్రీ వీసాను (Multi Entry Tourist Visa) ప్రవేశపెట్టింది. భారతీయుల కోసం ఉద్దేశించిన ఈ వీసా.. దరఖాస్తు చేసుకున్న రెండు నుంచి ఐదు రోజుల్లోపు జారీ చేస్తారు. ఐదేళ్ల వ్యాలిడిటీతో జారీ చేసే ఈ వీసాతో తొలుత 90 రోజుల దుబాయ్‌లో పర్యటించవచ్చు .ఆ తరువాత వీసాను ఏడాదికి గరిష్ఠంగా 180 రోజులు చొప్పున పొడిగించుకోవచ్చు.
Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!
ఇటీవల కాలంలో దుబాయ్‌లో భారత పర్యాటకుల (Indian Tourists) సంఖ్య గణీయంగా పెరిగింది. 2023లో ఏకంగా 2.46 మిలియన్ల మంది దుబాయ్‌లో పర్యటించారు. 2022లో 1.84 మిలియన్ల మంది భారతీయులు దుబాయ్‌ని సందర్శించారు. కరోనా సంక్షోభం పూర్వ నాటి సంఖ్యల కంటే కూడా గతేడాది దుబాయ్‌లో జనాలు అధికంగా పర్యటించారు. దుబాయ్‌లో భారతీయ పర్యాటకుల సంఖ్య ఏటా సగటున 34 శాతం మేర పెరుగుతోంది.
ఇక భారత్‌తో పర్యాటక, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ దుబాయ్ ఎకనమిక్ ఎజెండాలో పలు లక్ష్యాలు నిర్దేశించారు. భారత్ నిర్వహించే ప్రముుఖ ఎస్ఏటీటీఈ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లోనూ దుబాయ్ ఉత్సాహంగా పాల్గొంటుంది. ఈ ప్రదర్శనలో తమదేశపు ప్రత్యేక ఆకర్షణలను ప్రజల ముందుంచుతుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఈ మల్టీ ఎంట్రీ వీసా ప్రారంభించింది.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 25 , 2024 | 05:41 PM