ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

H-1B Visa: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు నూతన మార్గదర్శకాలు

ABN, Publish Date - May 15 , 2024 | 09:13 PM

ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.


గ్రేస్ పీరియడ్‌ సమయంలోనే తమ స్టేటస్‌ని నాన్-ఇమ్మిగ్రెంట్‌గా మార్చుకునేలా దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. స్టేటస్ అప్లికేషన్‌ని సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పించింది. ‘నిర్బంధ పరిస్థితుల’ కింద కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీని ద్వారా ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు ఒక ఏడాది కాలానికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌కి (EAD) అర్హత పొందే అవకాశం ఉంటుంది. చివరిగా ఉద్యోగ యజమానిని కూడా మార్చుకునేలా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.


అదనంగా ఇతర ఉపాధి అవకాశాల్లోకి సజావుగా మారేందుకు వీలుగా హెచ్-1బీ వీసాదారులకు పోర్టబిలిటీ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. తద్వారా వీలైనంత త్వరగా హెచ్-1బీ వీసాదారులు ఏదో ఒక ఉద్యోగాన్ని చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ఆమోదం కోసం ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం లేకుండానే ఇతర ఉద్యోగం పొందే సౌలభ్యం దక్కినట్టయ్యింది.


సెల్ఫ్-పిటిషన్ ద్వారా ఇమ్మిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉన్న హెచ్-1బీ వీసాదారులు తమ స్టేటస్‌ని సర్దుబాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్న సమయంలోనే పిటిషన్లను సమర్పించవచ్చు. ఈ అప్లికేషన్లు ప్రాసెస్ అవుతున్న సమయంలోనే వీసాదారులు అమెరికాలోనే ఉండి ఉండి ఎంపాయి‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌ని (EAD) పొందవచ్చు. ఏడాది పాటు ఈఏడీకి అర్హులయ్యే అవకాశం ఉంది.


కాగా గూగుల్, టెస్లా, వాల్‌మార్ట్ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. బాధితుల్లో చాలామంది హెచ్-1బీ వీసాదారులు కూడా ఉన్నారు. సాధారణంగా ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు కేవలం 60 రోజుల గ్రేస్ పిరియడ్ మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇతర ఉద్యోగాలు చూసుకోవడం సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే వెసులుబాట్లు కల్పిస్తూ యూఎస్‌సీఐఎస్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated Date - May 15 , 2024 | 09:13 PM

Advertising
Advertising