ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: గల్ఫ్ జనసేన యూఏఈ అధ్వర్యంలో ఘనంగా తృతీయ కార్తీక వనసమారాధన

ABN, Publish Date - Nov 10 , 2024 | 03:31 PM

దుబాయ్ యూఏఈ గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో తృతీయ కార్తీక వనభోజనాలు గల్ఫ్ జనసేన కేంద్ర కార్యాలయంలో  అంగరంగ వైభవంగా జరిగాయి.

ఎన్నారై డెస్క్: దుబాయ్ యూఏఈ గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో తృతీయ కార్తీక వనభోజనాలు గల్ఫ్ జనసేన కేంద్ర కార్యాలయంలో  అంగరంగ వైభవంగా జరిగాయి. యూఏఈ నలుమూలల నుండి దాదాపు 500 మంది జన సైనికులు వీర మహిళలు  హాజరయ్యారు (NRI).

ముందుగా వీర మహిళలు పూజా కార్యక్రమం చిన్నారుల సాంస్కృతిక, సంప్రదాయ నాట్యంతో, ఆటపాటలతో ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆర్కే నాయుడు సాగర్, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య,  చిత్తూరు జిల్లా  ఇంచార్జి , పీఏసీ సభ్యులు పసుపులేటి హరి ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ , రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషిని కొనియాడారు.

Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ


ఆంధ్రప్రదేశ్ గల్ఫ్‌లో కార్మికులు పడుతున్న కష్టాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేకంగా చర్చిస్తానని, గల్ఫ్ నుంచి తిరుపతి వచ్చే ఎన్నారైలకు ఎలాంటి అవసరం చేయడానికి అయినా తాను సిద్ధంగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన ప్రసంగంలో తెలియ చేశారు. గల్ఫ్‌లో పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆరణి శ్రీనివాసులు ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన శ్రీ వెంకటేవార స్వామి లడ్డూను వచ్చిన వారందరికీ పంచారు. 

ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వీసా లేకుండా ఉన్న వారిని భారత కాన్సులేట్ జనరల్ సహాయంతో పంపించడం వంటివి ఎన్నో సహాయ  కార్యక్రమాలు, కఠిన చట్టాలు అమలులో ఉండే యూఏఈలో సాధ్యం కానివి కూడా సాధ్యం చేసి చూపించని ఒక్క గల్ఫ్ జనసేన యూఏఈకి మాత్రమే దక్కుతుందని శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.

 NRI: ఘనంగా డీటీఏ దీపావళి వేడుకలు!


జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆర్కే నాయుడు సాగర్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి గల్ఫ్‌లోని తెలంగాణ రాష్ట్ర వాసులు ఇబ్బందులను తెలుసుకొని వారికి అండగా ఉండేందుకు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం, గల్ఫ్ దేశాలలో గల్ఫ్ తెలంగాణ జనసేన పార్టీ నాయకులు బాధ్యతలు అప్పగించి తెలంగాణ గల్ఫ్ విభాగం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు . 

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని చూసి జనసేన పార్టీలో చేరానని అన్నారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మహిళలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. శ్రీ హరి ప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. వనభోజనాలు కార్యక్రమాన్ని వీర మహిళల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం మామూలు విషయం కాదని వీర మహిళలును వచ్చిన అతిథులు అభినందించారు .  

Kamala Harris: నేను ఈ స్థితిలో ఉన్నానంటే అమ్మే కారణం: కమలా హ్యారిస్


గల్ఫ్ ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా, గల్ఫ్‌లోని సమస్యలు తెలుసుకుంటూ, ఆపదలో ఉన్న వారికి అభయ అస్త్రం ఇస్తూ, గల్ఫ్‌లో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు.

అలాగే ఆటపాటలతో అలరించిన చిన్నారులకు ఎమ్మెల్యే అతిథులు అభినందన జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం అనంతరం, ఎన్నారై టీడీపీ యూఏఈ నాయకులు,  జనసేన యూఏఈ నాయకులు, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ వీర మహిళలు వచ్చిన అతిధులను ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో నేషనల్ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ కువైట్, నేషనల్ కన్వీనర్ మొగేళ్ల చంద్రశేఖర్, కన్వినర్ బిరడా సూర్య నారాయణ ( కువైట్), యూఏఈ కన్వీనర్లు , ఎక్సిక్యూటివ్ మెంబెర్స్, వీర మహిళలు పాల్గొన్నారు.

Read latest and NRI News

Updated Date - Nov 10 , 2024 | 03:33 PM