Singapore: ఎన్నారైకి షాక్! పొరపాటున తన అకౌంట్‌కు బదిలీ అయిన డబ్బును వాడినందుకు..
ABN, Publish Date - Oct 17 , 2024 | 10:26 PM
పొరపాటున తన బ్యాంకు అకౌంట్లోకి బదిలీ అయిన నిధులను ముందూ వెనకా ఆలోచించకుండా తన అవసరాలకు వాడుకున్న ఓ ఎన్నారైకి సింగపూర్ న్యాయస్థానం తొమ్మిది వారాల జైలు శిక్ష విధించింది.
ఎన్నారై డెస్క్: పొరపాటున తన బ్యాంకు అకౌంట్లోకి బదిలీ అయిన నిధులను ముందూ వెనకా ఆలోచించకుండా తన అవసరాలకు వాడుకున్న ఓ ఎన్నారైకి సింగపూర్ న్యాయస్థానం తొమ్మిది వారాల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
NRI: రియాద్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు
పెరియస్వామి మతియళగన్ అనే వ్యక్తి సింగపూర్‌లోని ఓ సంస్థలో 2021 నుంచి పనిచేస్తున్నాడు. అదే సంస్థలో ఉన్నతోద్యోగి ఒకరు గతేడాది తన బ్యాంకు లోన్ కట్టే క్రమంలో పొరపాటున డబ్బును పెరియస్వామి అకౌంట్‌కు బదిలీ చేశారు. తన తప్పు తెలుసుకున్న ఆమె చివరకు పెరియస్వామి బ్యాంకు యాజమాన్యాన్ని సంప్రదించి జరిగింది చెప్పారు. వెంటనే స్పందించిన బ్యాంకు వారు పెరియసామికి నోటీసు పంపించారు.
NRI: రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ
అయితే, పెరియసామి మాత్రం డబ్బు వెనక్కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా పెరియసామి ఆ డబ్బును అప్పటికే వాడేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నాలుగు విడతలుగా ఆ డబ్బును కొన్ని బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసి అతడు తన అప్పులు తీర్చుకున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, కొంత మొత్తాన్ని భారత్‌కు కూడా పంపించినట్టు దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ క్రమంలో పెరియసామి ఉద్యోగం చేస్తున్న కంపెనీ వారు కూడా ఆ డబ్బును తిరిగిచ్చేయాలని కోరారు. చివరకు అతడు జరిగింది చెప్పుకొచ్చాడు. తాను చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశాడు. తనకు కొంత సమయం ఇవ్వాలని కూడా కోరాడు.
NRI: దమ్మాంలో వైభవంగా దసరా వేడుకలు
ఇందుకు బాధితురాలు అంగీకరించినా పెరియసామి డబ్బులు తిరిగిచ్చేయడంలో విఫలంగా కావడంతో చివరకు కటకటాలపాలు కాకతప్పలేదు. తాను తప్పు చేసినట్టు పెరియసామి అంగీకరించడంతో కోర్టు అతడికి 9 వారాల కారాగార శిక్ష విధించింది. ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్ కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. తన డబ్బు కాదని తెలిసీ అతడు ఇలాంటి తప్పు ఎలా చేశాడని ప్రశ్నిస్తున్నారు.
NRI: అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు!
Updated Date - Oct 17 , 2024 | 10:32 PM