ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగస్టు 4న న్యూజెర్సీలో సమావేశం!

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:18 PM

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆగష్టు 4న ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోగల రాయల్ అల్బెర్ట్స్ పాలస్‌లో భారీ ఎత్తున సమావేశం జరగనుంది.

Indian Community, Indian overseas congress meeting in usa

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆగష్టు 4న ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోగల రాయల్ అల్బెర్ట్స్ పాలస్‌లో భారీ ఎత్తున సమావేశం జరగనుంది. ఈ సమావేశ సన్నాహాల్లో భాగంగా నిర్వాహక బృందం జూలై 28 ఆదివారం రాయల్ అల్బెర్ట్స్ పాలస్ సందర్శించారు. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్న ఈ సమావేశానికి చెయ్యాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు.

NRI: తెలుగుదేశం కార్యకర్తలు నిజాయితీకి మారుపేరు: ఖతర్ టీడీపీ అధ్యక్షుడు


తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించే నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బహుళజాతి కంపెనీల సీఈవోలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇప్పటివరకూ అధికారులు కొన్ని ఎంఎన్‌సీలతో సంప్రదింపులు జరిపారని, ఎంఓయులపై సంతకాలు చేయడంపై పర్యటన సందర్భంగా సీఎం ప్రకటించే అవకాశం ఉంది.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 03:54 PM

Advertising
Advertising
<