USA: అమెరికాలో భారతీయ యువతి అదృశ్యం!
ABN, Publish Date - Mar 10 , 2024 | 06:05 PM
అమెరికాలో ఓ భారతీయ యువతి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. న్యూయార్క్ నగరంలో ఫరీన్ ఖోజా అనే యువతి (25) మార్చి 1న కనిపించకుండా పోయింది.
ఎన్నారై డెస్క్: అమెరికాలో (USA) ఓ భారతీయ యువతి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. న్యూయార్క్ నగరంలో (NewYork City) ఫరీన్ ఖోజా అనే యువతి (25) మార్చి 1న కనిపించకుండా పోయింది (Indian woman goes missing). ఆ రాత్రి సుమారు 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. ఆమె గురించి సమాచారం తెలిసిని వారు తక్షణం తమను సంప్రదించాలని పోలీసులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
TS News: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగిన రోజు మహిళ ఆలివ్ గ్రీజ్ జాకెట్, ఆకుపచ్చ స్వెట్టర్, నీలిరంగు జీన్స్ ధరించారు. యువతికి బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) కూడా ఉందని పోలీసులు తెలిపారు. యువతి ఆచూకీ తెలుసుకునేందుకు 112 ప్రీసింక్ట్ డిటెక్టివ్ బృందం విస్తృతంగా గాలిస్తోంది. కాగా, ఘటన సమాచారాన్ని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు తెలియజేశామని పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ కోసం దౌత్యకార్యాలయం కూడా తన వంతు ప్రయత్నం చేస్తోందన్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 10 , 2024 | 06:07 PM