NRI-Janasena: జనసేన - కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం
ABN, Publish Date - Mar 15 , 2024 | 08:10 PM
జనసేన - కువైత్ ఆధ్వర్యంలో 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న ఘనంగా జరిగాయి.
ఎన్నారై డెస్క్: జనసేన - కువైత్ ఆధ్వర్యంలో 11వ జనసేన (Janasena) ఆవిర్భావ వేడుకలు మార్చి 14న ఘనంగా జరిగాయి. గౌరవ అతిథులుగా సంఘసేవకులు డా. శ్రీధర్, ప్రవాసాంధ్ర తెలుగుదేశం వ్యవస్థాపకులు ములకల సుబ్బారాయుడు, గల్ఫ్ కౌన్సెల్ సభ్యులు వెంకట్ కోడూరి, సురేష్, పత్తి సుబ్బారాయుడు, మురళి రాయల్, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాసేవ నిస్వార్థంగా ఉండాలని నమ్మి ప్రజాసేవకు అంకితం అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని, వారికి తన మద్దతు తెలియచేస్తూ వారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కూటమి గెలవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
NRI: బే ఏరియాలో 'తెలుగుదేశం-జనసేన-బీజేపీ' ఎన్నారైల ఆత్మీయ సమావేశం!
ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కువైత్‌లో ఎవరికి వారు చేసుకొనే వారు అని, వారందరినీ కలుపుకొని ప్రవాసాంధ్ర తెలుగుదేశం అని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేవాళ్లమని అన్నారు. ఒక వేదికను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం అంత సులభం కాదని, విభిన్న అభిప్రాయాలు ఉన్న సమూహాన్ని నడపడం కష్టమని అభిప్రాయపడ్డారు. అలాంటిది ఒక పార్టీనీ నడపడం మరింత కష్టమని తెలిపారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన జనసేన అధినేతకు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురు అయ్యాయని వాటిని అన్నిటినీ తట్టుకొని పార్టీనీ నడపడం కష్టమని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను ఒక విశిష్ట నాయకుడిగా కొనియాడారు.
గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజాసేవకు జీవితం అంకితం చేసిన పవన్ కళ్యాణ్‌కు, జనసేన సైనికులకు పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కోట్ల ఆదాయాన్ని వదిలి, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చుట్టూ కమ్ముకున్న చీకటిలో గుండె నిండా ధైర్యం నింపుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి పవన్ వచ్చారన్నారు. ‘‘మొదట ఎన్నికల్లో రాష్ట్రం కోసం ఎన్నికలు వెళ్లకుండా కూటమికి మద్దతు తెలిపారు. ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం అని భావించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. తక్కువ సీట్‌లు తీసుకున్నారని విమర్శలు చేశారు. మనం సంస్థాగతంగా ఎదగాలి, కింది స్థాయి నుంచి పార్టీనీ బలపరచి రాజకీయంగా ఎదగాలి అనే లక్ష్యం తో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన భవిష్యత్తును చూస్తున్నారు. అధికారంలో భాగస్వామ్యం అయితేనే మనం మన లక్ష్యాలను సాధించగలమని నమ్మారు కాబట్టే, ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి నాయకుడి నిర్ణయాలను, ఆశయాలను గౌరవిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్న Kuwait jansena నాయకులకు, జనసేన సైనికులుకు 11వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి గెలిపించాలి’’ అని కోరారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న జనశ్రేణులు, తెలుగుదేశం శ్రేణులందరికీ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేనపార్టీ కువైత్ కార్యవర్గం సభ్యులు గంటా రమేష్, గ్రందే ప్రసాద్, బల్లేపల్లి శ్రీనివాస్, తోట చంగళ్ రాయుడు, కుంచా.శంకర్, మోడెం చిరంజీవి, ధరణి ప్రదీప్, పార్లపల్లె వెంకీ రాయల్, గంగారపు చంద్ర శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 08:20 PM