ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: బాలభారతి పాఠశాల విద్యార్థులకు రూ. 10 లక్షల విరాళం!

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:38 PM

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువుతున్న తల్లితండ్రులు లేని పిల్లలలకు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, కర్నూల్ ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో వరుసగా ఐదవ సంవత్సరం విరాళం అందజేశారు.

ఎన్నారై డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువుతున్న తల్లితండ్రులు లేని పిల్లలలకు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, కర్నూల్ ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో వరుసగా ఐదవ సంవత్సరం విరాళం అందజేశారు. మంగళవారం డిసెంబర్ 10న పాఠశాల యాజమాన్యానికి రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు (NRI).

2020లో ఇచ్చిన హామీ ప్రకారం దాతలు, మిత్రులు, సహారా మినిస్ట్రిస్, తానా ఫౌండేషన్ సహకారంతో గత ఐదు సంవత్సరాల్లో బాలభారతి పాఠశాలకు యాభై ఐదు లక్షల రూపాయల విరాళం అందించినట్లు పొట్లూరి రవి తెలిపారు. అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నా పలువురు ఎన్నారైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ


ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నామని ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గౌరు వెంకట్ రెడ్డి తెలిపారు. పొట్లూరి రవి స్ఫూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు, ఎన్నారై అనుముల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

TANA: తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ విజయవంతం


ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిథులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, సందడి మధు, వైస్ ప్రిన్సిపాల్ సవ్య, పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కార్యవర్గం, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల నాయకులు రామ భూపాల్ రెడ్డి,ఎస్సి సెల్ నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

Read latest and NRI News

Updated Date - Dec 10 , 2024 | 06:02 PM