ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

New Zealand Visa: వీసా రూల్స్‌లో తక్షణ మార్పులు.. న్యూజిలాండ్ సంచలన ప్రకటన

ABN, Publish Date - Apr 08 , 2024 | 09:00 PM

దేశంలో వలసల కట్టడికి రంగంలోకి దిగిన న్యూజిలాండ్.. వీసా నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు ఆదివారం ప్రకటించింది.

ఎన్నారై డెస్క్: దేశంలో వలసల కట్టడికి న్యూజిలాండ్ (New Zealand) రంగంలోకి దిగింది. వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు (Visa rules) చేస్తున్నట్టు ఆదివారం సంచలన ప్రకటన చేసింది. దేశంలో విదేశీయుల రాకడ తట్టుకోలేనంత స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించింది.

UK: లండన్‌ పోస్టాఫీసులో భారత సంతతి వ్యక్తి దోపిడీ..ఏప్రిల్ ఫూల్స్ డే నాడు..

విదేశీయుల ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల ప్రమాణాలను పెంచడం, వివిధ వర్క్ వీసాలకు సంబంధించిన కనీస నైపుణ్యాలు, అనుభవ అర్హతలను పెంచడం, తక్కువ నైపుణ్యాలవసరమైన వృత్తుల్లోని వారిని గరిష్ఠంగా ఐదేళ్లు మాత్రమే దేశంలో ఉండేలా నిబంధనలు మార్చడం తదితర చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది (New Zealand Immediate Changes to Visa Rules).


అత్యధిక నైపుణ్యాలున్న విదేశీయులను దేశంలోకి ఆకర్షించమే తమ లక్ష్యమని న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫర్డ్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో సెకండరీ టీచర్ల కొరత ఉండటంతో ఆ ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొరత లేని రంగాల్లో న్యూజిలాండ్ వాసులకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

USA: 99 ఏళ్ల భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం

గతేడాది న్యూజిలాండ్‌కు రికార్డు స్థాయిలో 1.73 లక్షల మంది విదేశీయులు వలస వెళ్లారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్ ప్రస్తుత జనాభా 5.1 మిలియన్లు కాగా, కరోనా సంక్షోభం తరువాత దేశంలోకి వలసలు పెరిగాయి. ఫలితంగా అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పొరుగున ఉన్న ఆస్ట్రేలియాలోనూ వలసలు పెరిగాయి. దీంతో రాబోయే రెండేళ్లల్లో విదేశీయుల రాకను దాదాపు సగానికి తగ్గిస్తామని అక్కడి ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 09:08 PM

Advertising
Advertising