ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: హాలీఫాక్స్‌లో అంగరంగ వైభవంగా నోవా మల్టీ ఫెస్ట్-2024 వేడుకలు!

ABN, Publish Date - Aug 06 , 2024 | 06:39 PM

కెనడాలోని హాలిఫాక్స్, డార్ట్ మౌత్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మల్టీఫెస్ట్-2024 వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాల్ భరద్వాజ్ బృందం, సీఈవో జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

Nova multifest

కెనడాలోని హాలిఫాక్స్, డార్ట్ మౌత్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మల్టీఫెస్ట్-2024 వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాల్ భరద్వాజ్ బృందం, సీఈవో జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు కలిపి మొత్తం 27 వేల మంది హాజరయ్యారు. భారతీయ, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు.


భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని ప్రదర్శించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. భారతీయ దుస్తుల స్టాల్, భారతీయ ఆహార స్టాల్‌‌ను ఏర్పాటు చేశారు. ``ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ చిన్న పిల్లలు భారతీయ నృత్యం , శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించారు. అతిథులకు భారతీయ, తెలుగు వంటకాలను వడ్డించారు.


శ్రీహరి రెడ్డి చల్లా, సురేష్ ప్రియాంక, శ్రీలేఖ, చంద్ర శ్రీలేఖ, మిలింద్, శ్రీకాంత్, రోహిత్, సోను, ప్రదీప్ సౌజన్య, ఆస్తా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, సాత్వికీ, కావ్య తదితరులు ఈ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాల్లో పాల్గొని ఆహుతులను ఆహ్లాదపరిచారు.

Updated Date - Aug 06 , 2024 | 06:39 PM

Advertising
Advertising
<