NRI: కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:23 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారైలు కీలక పాత్ర వహించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. న్యూజెర్సీలోని ఎన్నారైలు శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ అభినందనసభలో ఆయన పాల్గొన్నారు.

NRI: కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

న్యూజెర్సీ,ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారైలు కీలక పాత్ర వహించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. న్యూజెర్సీలోని ఎన్నారైలు (NRI) శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ అభినందనసభలో ఆయన పాల్గొన్నారు. మోన్మౌత్ జంక్షన్‌లో ఎంబెర్ బాంకె‌ట్స్‌లో న్యూ జెర్సీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో సుమారు నాలుగు వందలమందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అంటూ పలువురు నినాదాలు చేశారు.

NRI: యూఎస్ఏలో ‘అన్నమయ్య డే’! సిలికానాంధ్ర ఆధ్వర్యంలో సంకీర్తనోత్సవం

1.jpg


అనంతరం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్నారైలు గుడివాడ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు అనువుగా ఉంటుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారైలు ఈ సారి ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎనలేని కృషి చేసారని కొనియాడారు. ఎన్నారైల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారికి నా ప్రత్యేక అభినందనలు తెలపాలని సీఏం చంద్రబాబు నాయుడు తెలిపారని ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా తెలిపారు.


ఈ కార్యక్రమంలో విద్యాధర్ గారపాటి, శ్రీహరి మందాడి, సమతా కోగంటి, హరి ముత్యాల, రాధా నల్లమల్ల, జగదీశ్ యలమంచలి, రాజా కసుకుర్తి తదితరులు ఎన్నికల సంగ్రామంలో తమ అనుభవాలని పంచుకున్నారు. కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షులు టి.జి.కె. మూర్తి, సాయి కృష్ణ బొబ్బా, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూజెర్సీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Sep 01 , 2024 | 10:27 AM

Advertising
Advertising