ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: యూఎస్‌ఏలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:46 PM

ఏపీలో కూటమి విజయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని మిన్నియాపొలిస్‌, సెయింట్ పాల్‌ నగరాల్లోని ఎన్నారైలు వేడుకలు నిర్వహించారు.

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయం సాధించడంతో పాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలిస్/ సెయింట్ పాల్‌లలోని ఎన్నారై (NRI) టీడీపీ, ఎన్నారై జనసేన, ఎన్నారై బీజేపీ నాయకులు ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు.

అమెరికాలో టీడీపీ అభిమానుల సంబురాలు

ఈ కార్యక్రమానికి సుమారు 200 పైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత మంది ఎన్నారైలు తమ మూలాలు మర్చిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీచేసి విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.


ఆన్‌లైన్ ద్వారా తమ సందేశాలను తాము చేయబోతున్న కార్యక్రమాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే విజయకుమార్ రాజా తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎన్నారైలు ఈ విజయం కోసం పడిన కష్టాన్ని, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ మిన్నియాపోలిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామ్ వంకిన, రావ్ గుత్తా, వెంకట్ జువ్వా, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి, వివేక్ వల్లూరి, మిత్రులు శ్రీమాన్ యార్లగడ్డ, నాగ్ నల్లబోలు, నాయుడు సాలాది, కాశీ బురిడి, ఆర్కే, వెంకన్న చౌదరి, సుమన్ లావు, హరీష్ చింతాడ, పరమేశ్వర్, నాగ్ బొల్లు, సత్యనారాయణ, అనిల్ స్వయంపు, మురళి ముత్యాల, బాల అక్కిన, అశోక్ సుంకవల్లి, కోటేశ్వర పాలడుగు, జనసేన నాయకులు సంతోష్, రఘు గొలకోటి, రామ్ కూటల, తదితరులు సహకారం అందించారు.

కార్యక్రమం తరువాత వచ్చినవారందరికీ పసందైన విందు భోజనాన్ని అందించారు. మిన్నియాపోలిస్, సెయింట్ పాల్ లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఈ ప్రాంతంలో చదువుతున్న పలువురు విద్యార్థులు, మహిళలు, పిల్లలు, పెద్దవారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 09:46 PM

Advertising
Advertising