ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. యూకేలో ఎన్నారైల సంబరాలు

ABN, Publish Date - Jun 09 , 2024 | 08:03 PM

ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం నేపథ్యంలో యూకేలో పార్టీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

ఎన్నారై డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు (NRI) సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి, రాష్ట్రంపై, పార్టీపై అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరూ రాక్షస పాలన అంతం కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో తెలుగువారు భారీ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. వీరు అందరూ తమ తమ పట్టణాల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సంబరాలు నిర్వహించి అభిమానం చాటుకుంటున్నారు.

తాజాగా యూకేలోని రగ్బీ సిటీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ శుక్రవారం సాయంత్రం ఈ వేడుకులను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహిస్తూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం జరిగిన వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జూమ్ కాల్ ద్వారా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

TDP: ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. అట్లాంటాలో తెలుగు మహిళల సంబరాలు


గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని శ్రీరత్న వీడియో సందేశం పంపగా మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ జూమ్ కాల్‌లో పాల్గొని ప్రసంగించారు. గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, సమస్యల కేంద్రంగా మార్చారని, ఆ పాలన చేదు జ్ఞాపకాలను తుడిచివేసి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించే దిశగా పాలన ఉంటుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

ఎన్నారైలు అన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని, రాష్ట్రంపై తమ ప్రేమను ఎన్నో విధాలుగా చాటుకున్నారని కొనియాడారు. ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా మంచి వాతావరణం సృష్టిస్తామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వంశీ నాగళ్ల, వీర పరిటాలతో పాటుగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ నేతలు అభినందనలు తెలిపారు.

Read Latest NRI News and Telugu News

Read more!

Updated Date - Jun 09 , 2024 | 08:03 PM

Advertising
Advertising