NRI: నైజీరియాలో తెలుగు ప్రవాసీని ప్రశంసించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 17 , 2024 | 03:17 PM
విదేశీ గడ్డపై నివసిస్తూ నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వినూత్నంగా ప్రయత్నిస్తున్న తెలుగు ప్రవాసీ యువకుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ తన నైజీరియా పర్యటన సందర్భంగా అభినందించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విదేశీ గడ్డపై నివసిస్తూ నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వినూత్నంగా ప్రయత్నిస్తున్న తెలుగు ప్రవాసీ యువకుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ తన నైజీరియా పర్యటన సందర్భంగా అభినందించారు.
NRI: గల్ఫ్ జనసేన యూఏఈ అధ్వర్యంలో ఘనంగా తృతీయ కార్తీక వనసమారాధన
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం క్రాంతినగర్ గ్రామానికి చెందిన బిర్కూరి ప్రదీప్ నైజీరియాలో పని చేస్తూ నైజీరియాతో పాటు ఆఫ్రీకా దేశాలలో భారతీయ సంస్కృతి, విలువల పరిరక్షణ, వ్యాప్తి కోసం తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని కూడా అధిరోహించారు. ప్రదీప్ కృషిని గుర్తించిన భారతీయ రాయబార కార్యాలయం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాజధాని అబుజాలో ఆయన్ను ప్రత్యేకంగా ప్రధాని చేతుల మీదుగా సత్కరించింది.
NRI: ఘనంగా డీటీఏ దీపావళి వేడుకలు!
ఈ మేరకు కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ప్రదీప్ తన చేతిలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను చేతబట్టి దిగిన ఫొటోను చూసిన ప్రధాని అభినందిస్తూ దానిపై సంతకం చేశారు. బీజేపీ అభిమాని అయిన ప్రదీప్.. నైజీరియాలోని తెలుగు ప్రవాసీ ప్రముఖులలో ఒకరు. అబుజాలో మోదీకి స్వాగతం పలికిన వారిలో దాదాపు సగం మంది తెలుగు ప్రవాసీయులేనని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
Updated Date - Nov 17 , 2024 | 03:26 PM